బాబాయిని పక్కనబెట్టి అబ్బాయితో గురూజీ మంతనాలు.. దేనికో?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జు్న్‌తో కలిసి అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా ఈ సినిమా నిలిచింది.

 Trivikram Meeting With Ram Charan For His Next Movie, Trivikram, Ram Charan, Ntr-TeluguStop.com

ఇక ఈ సినిమాతో బన్నీ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకోవడంతో త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించే పనిలో పడ్డాడు.

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి తన తాజా చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు ఈ డైరెక్టర్.

ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మరోసారి తనదైన మార్క్‌తో తెరకెక్కించి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్.ఈ సినిమాకు ‘అయినను పోయి రావలే హస్తినకు’ అనే టైటిల్‌ను పెట్టేందుకు త్రివిక్రమ్ సిద్ధమవుతున్నాడు.

కాగా ఈ సినిమా తరువాత మరో స్టార్ హీరోతో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయని త్రివిక్రమ్ ఇప్పుడు ఆయనతో కలిసి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఎన్టీఆర్ సినిమా తరువాత చరణ్‌తో కలిసి సినిమా చేయాలని త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తాడని ఆశిస్తున్న పవన్ ఫ్యాన్స్ ఆశలను అడియాసలు చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

మొత్తానికి బాబాయిని పక్కనబెట్టిన త్రివిక్రమ్ ఇలా అబ్బాయితో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాను వారు ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube