హీరో రామ్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా  

Trivikram Plan To Movie With Hero Ram, Red Movie, Hero Ram, RRR Movie, Jr NTR, Nithin, Ala Vaikuntapuramlo, Trivikram - Telugu Ala Vaikuntapuramlo, Hero Ram, Jr Ntr, Nithin, Red Movie, Rrr Movie, Trivikram

అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ కొట్టి జోరు మీద ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేయబోయే నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే.

TeluguStop.com - Trivikram Ram Rrr Ntr

అయితే ఆర్ఆర్ఆర్ ఈ ఏడాదిలోనే షూటింగ్ పూర్తయిపోతుంది వచ్చే ఏడాది త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాలని అనుకున్న తారక్ ఆలోచనలని కరోనా గండి కొట్టింది.ఈ ఆరు నెలల కాలం వృధాగా పోయింది.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం నెక్స్ట్ సినిమా తారక్ తో చేయాలని స్క్రిప్ట్ కూడా పూర్తి చేసి సిద్ధంగా ఉన్నాడు.లాక్ డౌన్ సమయంలో త్రివిక్రమ్ మరో స్టోరీ కూడా సిద్ధం చేసాడని టాక్ వినిపిస్తుంది.

TeluguStop.com - హీరో రామ్ తో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా-General-Telugu-Telugu Tollywood Photo Image

గతంలో నితిన్ తో చేసినట్లు తారక్ సినిమా కంటే ముందు ఈ కథతో యంగ్ హీరోతో సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

దాని కోసం హీరో రామ్ ని సంప్రదించినట్లు బోగట్టా.

ప్రస్తుతం రామ్ రెడ్ మూవీ కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమాకి రెడీగా ఉన్నాడు.అయితే ప్రస్తుతం పెద్ద దర్శకులు ఎవరూ ఖాళీ లేరు.

కొత్త దర్శకులు వచ్చినా కూడా రామ్ ఎవరి మీద అంత కాన్ఫిడెంట్ గా కనిపించడం లేదు.ఇదే సమయంలో త్రివిక్రమ్ కథ చెప్పడంతో వెంటనే ఒకే చెప్పినట్లు చర్చించుకుంటున్నారు.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ పూర్తిచేసేలోపు రామ్ తో తక్కువ బడ్జెట్ తో ఒక సినిమా పూర్తి చేసి వదలాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందని బోగట్టా.

#Hero Ram #Nithin #Trivikram #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trivikram Ram Rrr Ntr Related Telugu News,Photos/Pics,Images..