మాటల మాంత్రికుడితో జక్కన్న కోల్డ్ వార్.. నిజమేనా?  

Trivikram Rajamouli Rrr Ntr30 - Telugu Cold War, Ntr30, Rajamouli, Rrr, Tollywood News, Trivikram

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సూపర్ హిట్లు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లుగా ఉన్నవారిలో టాప్ రెండు స్థానాల్లో దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఖచ్చితంగా ఉంటారు.వీరి సినిమాలను ప్రేక్షకులు ఆదరించే తీరు వీరి స్థాయిని మనకు చూపెడుతుంది.

 Trivikram Rajamouli Rrr Ntr30

కాగా వీరిద్దరూ కూడా పబ్లిక్‌లో చాలా తక్కువగా కనిపించినా, వారు పబ్లిక్‌ను మెప్పించే సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.

అయితే టాలీవుడ్‌లో ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వార్త చాలా మందికి తెలియదు.

మాటల మాంత్రికుడితో జక్కన్న కోల్డ్ వార్.. నిజమేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రాజమౌళి, త్రివిక్రమ్ ఇద్దరూ తమ సినిమాల్లో తీసుకునే టెక్నీషియన్‌లను మళ్లీ మళ్లీ తమ సినిమాల్లో పెట్టుకుంటారని, ఇతర టెక్సీషియన్లను వారు తీసుకునేందుకు ఆసక్తి చూపరని ఇండస్ట్రీ వర్గాల్లో తెలిసిన విషయమే.ఇక వారు సినిమా చేస్తున్నంతసేపు దానికి సంబంధించిన ఎలాంటి విషయం కూడా బయటకు రాకుండా చూస్తుంటారు ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్.

ఇలా పలు విషయాల్లో రాజమౌళి, త్రివిక్రమ్ ఒకే విధంగా ముందుకు వెళ్తుండటంతో వారిద్దరు ఒకే పంథాలో ఉన్నట్లు తెలుస్తోంది.కానీ వారు ఒక హీరోతోనే సినిమా చేయడం చాలా అరుదుగా మనం చూస్తుంటాం.

ఏదేమైనా త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుండటంతో వారిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.మరి వీరిమధ్య నిజంగానే కోల్డ్ వార్ నడుస్తుందా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు