స్టేజ్ పై అందరి ముందు ఆ స్టార్ నిర్మాత కాళ్లకు దండం పెట్టిన త్రివిక్రమ్..!!   

trivikram punished the star producers legs in front of everyone on stage, Ravi Kishore, Trivikram, Red, Ram, Red Pre release event, ram, - Telugu Ram, Ravi Kishore, Red, Red Pre Release Event, Trivikram

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ నటించిన “రెడ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు డైరెక్టర్ త్రివిక్రమ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ.

TeluguStop.com - Trivikram Punished The Star Producers Legs In Front Of Everyone On Stage

ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వేదికపై గుర్తు చేసుకున్నారు.ఈ క్రమంలో రెడ్ సినిమా నిర్మాత రవికిశోర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వేడుకలో నిర్మాత రవి కిషోర్ గురించి మాట్లాడకుండా ఉండలేను అంటూ అప్పట్లో ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

TeluguStop.com - స్టేజ్ పై అందరి ముందు ఆ స్టార్ నిర్మాత కాళ్లకు దండం పెట్టిన త్రివిక్రమ్.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image
Telugu Ram, Ravi Kishore, Red, Red Pre Release Event, Trivikram-Movie

త్రివిక్రమ్ ఏమన్నారంటే.”‘నాకు స్వయంవరం సినిమా తర్వాత ఎవరూ ఇండస్ట్రీలో పెద్దగా సినిమా అవకాశాలు ఇవ్వడం లేదు.ఆ సమయంలో నేను నా సొంతూరు భీమవరం వెళ్లిపోయాను.

అప్పుడు రవికిషోర్ నాకు ఫోన్ చేసి పిలిపించి “నువ్వే కావాలి” సినిమా స్టోరీ రాయించారు’ అని చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్.అంతేకాకుండా ‘నువ్వు నాకు నచ్చావ్ కథ రాసేటప్పుడు ఆ ఫైల్ తన వద్దనే ఉంచుకొని.

ఒకరోజు అర్థరాత్రి నాకు ఫోన్ చేసి ఇందులో ఈ డైలాగ్ ఎంతో బాగుందంటూ నాకు చెప్పిన సందర్భాలు ఇంకా గుర్తు ఉన్నాయని పేర్కొన్నారు.

అంత పెద్ద స్టార్ ప్రొడ్యూసర్ అయినాగాని అప్పట్లో నేను రాసిన కథ మొత్తం చదివేవారు.

ఇటువంటి ఆయనకు నాలుగు సినిమాలు రాసే అదృష్టం దక్కింది.ఆయన గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే’ అంటూ త్రివిక్రం భావోద్వేగానికి లోనయి.

స్టేజి పైనే ఆయన కాళ్లపై దండం పెట్టారు.జీవితంలో ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా గాని రవి కిషోర్ కి రుణపడి ఉంటానని త్రివిక్రమ్ స్పష్టం చేశారు.

ఈ సన్నివేశం చూసి వేదికపై ఉన్న అడ్రస్ మొత్తం ఒక్కసారిగా లేచి చప్పట్లు కొట్టారు.సోషల్ మీడియాలో కూడా ఈ వార్త పై ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం త్రివిక్రమ్ ది  అన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

#RedPre #Ravi Kishore #Trivikram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు