త్రివిక్రమ్ ఆ ఇంటికి ప్రతి నెల ఐదు వేలు కడుతున్నాడా.. ఎందుకు?

ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం గురించి అందరికి తెలిసిందే.ఈయన దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా మంచి విజయాన్ని అందుకున్నాయి.

 Trivikram Pays Rent To The House Trivikram, Tollywood, Rent 5000, Rrr N, Sunil ,-TeluguStop.com

ఈయన దర్శకత్వంలో కథలన్నీ ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ లోనే ఎక్కువగా ఉంటాయి.ఇక ఈయన ఎక్కువగా స్టార్ హీరోల వైపే ఆసక్తి చూపుతాడు.

ఇక ప్రస్తుతం పలువురు స్టార్ హీరోల సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఓ ఇంటికి ప్రతినెల ఐదు వేలు కడతాడట.

త్రివిక్రమ్ తన కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడట.త్రివిక్రమ్ గతంలో కమెడియన్ సునీల్ తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారట.అలా ఆ ఇంట్లో తమ కెరీర్ మొదలు కాగా ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట.ఇక అలా తమ ప్రయాణాన్ని ఆ ఇంట్లో కొనసాగిస్తూ త్రివిక్రమ్ దర్శకుడిగా, సునీల్ కమెడియన్ గా నిలిచారు.

Telugu Trivikram, Carrier, Sunil, Sunil Trivikram, Tollywood-Movieఅలా ఆ ఇల్లును సెంటిమెంట్ గా భావించిన త్రివిక్రమ్ ఇప్పటికీ ఆ ఇంటికి ప్రతినెల ఐదు వేలు రూపాయలను అద్దె గా కడుతున్నాడని తెలిసింది.ఇక ఈ ఇల్లు పంజాగుట్టలోని ఉంటుందట.ఇప్పటికీ ఆ ఇంటిని మర్చిపోలేక ఆ ఇంట్లోనే కూర్చొని సినిమా కథలను, మాటలను రాస్తాడట.ఇక ఈ ఇంట్లో కూర్చుంటే తనకు కథలు రాయడం ఎంతో సులభమని.

అందుకే ఈ ఇంటికి ఇప్పటికీ అద్దె చెల్లిస్తూ అక్కడే సినిమా కథలను రాస్తుంటాను అని తెలిపాడు త్రివిక్రమ్.

Telugu Trivikram, Carrier, Sunil, Sunil Trivikram, Tollywood-Movieఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత తన దర్శకత్వంలో అయినను పోయిరావలె అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా ఫిక్స్ చేశాడు.అంతే కాకుండా పలువురు స్టార్ హీరోల కోసం కొన్ని కథలను సిద్ధంగా ఉంచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube