ఆర్ఆర్ఆర్ బిస్కెట్‌కు త్రివిక్రమ్ క్రీమ్.. గుడ్డిలో మెల్ల!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ భావించినా, ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా అది కుదిరేలా లేదు.

 Trivikram Will Not Do Any Movie Before Ntr30, Trivikram, Ntr30, Ntr, Rrr, Rajamo-TeluguStop.com

దీంతో ఈ సినిమాను వచ్చే వేసవికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమాకు సంబంధించి తారక్ ఫస్ట్ లుక్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు.

కానీ తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లేసింది.మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా ఎలాంటి ఫస్ట్ లుక్ రిలీజ్ ఉండబోదని వారు తేల్చేశారు.

దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు.అయితే వారి నిరాశకు కాస్త ఊరటనిచ్చే మాట మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెలిపాడు.

ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి ఏదైనా అనౌన్స్‌మెంట్ మే 20న ఉండబోతున్నట్లు ఇప్పటికే చిత్ర వర్గాల సమాచారం.కాగా ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ త్రివిక్రమ‌తో కాకుండా వేరు డైరెక్టర్‌తో సినిమాను చేసి, దాని తర్వాత త్రివిక్రమ్ మూవీ చేస్తాడనే వార్త ఇండస్ట్రీలో గతకొంతకాలంగా వినిపిస్తోంది.

అయితే అలాంటి వార్తలు ఏమాత్రం నమ్మవద్దని, తారక్ సినిమాకు ముందు మరే ఇతర సినిమాను కూడా త్రివిక్రమ్ చేయబోడని తెలుస్తోంది.అంటే ఆర్ఆర్ఆర్ తరువాత ఖచ్చితంగా త్రివిక్రమ్-తారక్ సినిమానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.

ఏదేమైనా తారక్ సినిమాలపై బోలెడు ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌కు ఇది కొంతలో కొంత మంచి వార్త అనే చెప్పాలి.మరి మే 20న కనీసం ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించి ఏదైనా గిఫ్ట్ ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube