తారక్‌ను ఒకే దెబ్బతో కొట్టేయనున్న త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

 Ntr Trivikram Movie To Finish In Single Schedule, Ntr, Trivikram, Ntr30, Tollywo-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు.కాగా ఈ సినిమా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ కూడా చేశారు.అయితే ఈ సినిమా షూటింగ్‌ను మాత్రం ఇంకా ప్రారంభించలేదు.దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ముగియగానే త్రివిక్రమ్ చిత్రాన్ని ప్రారంభించాలని తారక్ భావించాడు.

కానీ అది ఇప్పట్లో అయ్యే పనిలా కనిపించడం లేదని తెలుస్తోంది.దీంతో త్రివిక్రమ్ చాలా రోజుల వరకు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్‌ను కేవలం సింగిల్ షెడ్యూల్‌లోనే ముగించేయాలని త్రివిక్రమ్ ప్రణాళిక రూపొందిస్తున్నాడు.

సింగిల్ షెడ్యూల్‌లో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని పరిష్కరించే విధానాలను త్రివిక్రమ్ తెలుసుకుంటున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అంటే, తారక్ 30వ చిత్రం కేవలం ఒక్క షెడ్యూల్‌లోనే ముగుస్తుందని తెలుస్తోంది.

ఇక పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను త్రివిక్రమ్ తీర్చిదిద్దేందుకు రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయాలని భావిస్తోందట.

తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు, త్వరలోనే వారిని ఫైనలైజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube