ఈసారి త్రివిక్రమ్‌ కూడా పాన్‌ ఇండియా అంటున్నాడు  

Trivikram Next Movie Pan India Movie With NTR - Telugu Aravinda Sametha, Ntr, Ntr In Rrr, Ntr Latest Update, Pan India Movie, Trivikram, Trivikram And Ntr,

ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ అంతా కూడా పాన్‌ ఇండియా మూవీ అంటూ చక్కర్లు కొడుతున్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేసి నాలుగు రాళ్లు ఎక్కువ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

Trivikram Next Movie Pan India Movie With Ntr

నిర్మాతకు కాస్త ఎక్కువ డబ్బులు వస్తే తమకు అందులో షేర్‌ వస్తుందనే ఉద్దేశ్యంతో దర్శకులు పాన్‌ ఇండియా సినిమాలకు ఆసక్తి చూపిస్తున్నారు.హీరోలు మాత్రమే కాకుండా దర్శకులు కూడా ఉత్తరాదిన తమ సినిమాలు విడుదల అవ్వాలని కోరుకుంటున్నారు.

ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే ఆకట్టుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ మొదటి సారి పాన్‌ ఇండియా సినిమాను ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ తదుపరి చిత్రం తెరకెక్కబోతుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.త్వరలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి.ఈ సమయంలో ఈ సినిమా కథ పాన్‌ ఇండియా కథ అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఈసారి త్రివిక్రమ్‌ కూడా పాన్‌ ఇండియా అంటున్నాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది.

అందుకే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న సినిమాకు పాన్‌ ఇండియా లెవల్‌లో మంచి బిజినెస్‌ అవుతుంది.అందుకే వరుసగా ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా పాన్‌ ఇండియా మూవీ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నారు.త్రివిక్రమ్‌ 250 కోట్ల టార్గెట్‌తో ఎన్టీఆర్‌తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడట.100 కోట్ల బడ్జెట్‌ను పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.మరి త్రివిక్రమ్‌ పాన్‌ ఇండియా ప్లాన్స్‌ వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trivikram Next Movie Pan India Movie With Ntr Related Telugu News,Photos/Pics,Images..