తారక్ తోనే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా... అఫీషియల్ కన్ఫర్మ్  

Trivikram-jr Ntr Movie Official Conformed - Telugu Official Conformed, Pooja Hegde, South Cinema, Tollywood, Trivikram Jr Ntr Movie

అజ్ఞాతవాసి తర్వాత అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ కట్టి దర్శకుడుగా తనకి తిరుగులేదని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు.మరి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏముంటుంది అని గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో చర్చ నడిస్తుంది.

Trivikram-jr Ntr Movie Official Conformed - Telugu Pooja Hegde South Cinema Tollywood Trivikram Jr Ntr

చిన్న హీరోతో లో బడ్జెట్ తో ఒక మూవీ చేస్తాడని కూడా చెప్పుకున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ తో మూవీ కన్ఫర్మ్ అయిపోయిందని త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది అని కూడా గట్టిగా వినిపించింది.

అయితే ఇలాంటి ఊహాగానాలకి ఫుల్ స్టాప్ పెడుతూ త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా గురించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.

మాటల మాంత్రికుడు తన నెక్స్ట్ సినిమాని తన హోం బ్యానర్ అయిన హారికా హాసినీ క్రియేషన్స్ లోనే చేస్తున్నారు.

అది కూడా జూనియర్ ఎన్టీఆర్ తోనే.ఇక వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు కూడా పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.

అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాతనే త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.ఇక ఇందులో హీరోయిన్ గా మరోసారి త్రివిక్రమ్ పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

తాజా వార్తలు

Trivikram-jr Ntr Movie Official Conformed-pooja Hegde,south Cinema,tollywood,trivikram Jr Ntr Movie Related....