పవన్‌ రీమేక్‌ కు త్రివిక్రమ్‌ మాటలు మాత్రమే కాదు.. మొత్తం తానే  

trivikram is the shadow director of pawan rana movie , ayyappanum koshiyum remake, pawan kalyan, rana daggubati, trivikram dialogues, pawan with trivikram, pawan fans - Telugu Ayyappanum Koshiyum Remake, Pawan, Pawan Fans, Pawan Kalyan, Pawan Rana Movie, Pawan With Trivikram, Rana, Rana Daggubati, Sagar Chandra, Trivikram, Trivikram Dialogues, Trivikram Is The Shadow Director Of Pawan Rana Movie

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా కు తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు.పవన్‌ మరియు రానాలు నటిస్తున్న ఈ రీమేక్‌ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

TeluguStop.com - Trivikram Is The Shadow Director Of Pawan Rana Movie

అయితే ఈ సినిమా కు మాటలు మరియు స్క్రీన్‌ ప్లేను స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ అందిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.ఇక ఈ సినిమా చిత్రీకరణ తాజాగా ప్రారంభం అయ్యింది.

సాదారణంగా అయితే మాటల రచయిత మరియు స్క్రీన్ ప్లే రచయితలకు ఎక్కువగా ఆన్‌ సెట్స్ పని ఉండదు.కాని మొదటి రోజు షూటింగ్ సందర్బంగా త్రివిక్రమ్‌ హాజరు అవ్వడంతో చాలా మంది ఈ సినిమా మొత్తం బాధ్యత త్రివిక్రమ్‌ చూసుకుంటున్నాడు.

TeluguStop.com - పవన్‌ రీమేక్‌ కు త్రివిక్రమ్‌ మాటలు మాత్రమే కాదు.. మొత్తం తానే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమా షూటింగ్ వ్యవహారం మొత్తం కూడా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు.అంటే సాగర్‌ చంద్ర కేవలం పేరుకు మాత్రమే అని, ఈ సినిమాకు షాడో డైరెక్టర్‌ గా త్రివిక్రమ్‌ వ్యవహరిస్తున్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి ఈ సినిమా షూటింగ్‌ సందర్బంగా త్రివిక్రమ్‌ కనిపించడంతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.సాగర్‌ చంద్ర సినిమా సక్సెస్ అయినా క్రెడిట్ దక్కించుకోవడం కష్టమే అన్నట్లుగా కొందరు వ్యాఖ్యలు చేస్తుంటే మరి కొందరు మాత్రం త్రివిక్రమ్‌ తో పవన్ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి.కనుక సాగర్‌ చంద్ర పేరు చెప్పి సినిమాను తానే చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి పవన్‌ మరియు త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ వస్తున్నందుకు అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

షూటింగ్‌ మొదలైన ఈ సినిమాను ఇదే ఏడాది లో విడుదల చేస్తామని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.దాంతో సినిమా పవన్ అభిమానుల ఆనందంకు అవధులు లేవు.

ఈ సినిమా చిత్రీకరణ కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేస్తారని సమాచారం అందుతోంది.అదే నిజం అయితే సినిమాను దసరా వరకు విడుదల చేసే అవకాశం ఉంది.

#Pawan #TrivikramIs #Sagar Chandra #Rana #PawanWith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు