చిన్న సినిమాకి కథ అందిస్తున్న మాటల మాంత్రికుడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా అల వైకుంఠపురం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నాడు.

 Trivikram Gives Low Budget Movie Concept For Home Production-TeluguStop.com

స్టార్ దర్శకుడుగా ఉన్న త్రివిక్రమ్ స్టామినా ఏంటో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇక టాలీవుడ్ బడా దర్శకులు కథలు రాసినపుడు అవి చిన్న హీరోకి సరిపోతాయి అనుకున్నప్పుడు తమ శిష్యులని దర్శకులుగా పరిచయం చేస్తూ వాళ్ళే కథ అందించి హోం ప్రొడక్షన్ లో సినిమాలు నిర్మిస్తూ ఉంటారు.

ఇప్పుడు అదే దారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేస్తున్నారు.ఇప్పటికే చల్ మోహన్ రంగా సినిమా కథని నితిన్ కోసం అందించిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ అవ్వలేదు.

అయితే ఇప్పుడు మరోసారి తాను కథ అందిస్తూ తన హోం ప్రొడక్షన్ అయిన హారికా హాసినీ క్రియేషన్స్ లో చిన్న బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.అయితే దానికి కేవలం తాను కథ మాత్రమే అందించబోతున్నాడు.

దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.తన అసిస్టెంట్ ని ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube