త్రివిక్రమ్ కి అతిపెద్ద తలనొప్పి

మొన్న బ్రూస్ లీ సినిమాకి తెలుగు లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ని దించుదాం అనుకున్నారు కానీ అది అంతగా వర్క్ అవలేదు.ఇప్పుడు త్రివిక్రమ్ తన ఆప్త మిత్రుడు దేవీ శ్రీ ని పక్కన పెట్టి మరీ కొత్త సినిమా ‘అ ఆ’ కోసం అనిరుధ్ ని రంగం లోకి దించాడు.

 Trivikram Faces Issues With Anirudh-TeluguStop.com

తెలుగు లో తొలిసారిగా వచ్చిన అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి హై లైట్ కాబోతోంది అని అందరూ ఊహించారు కానీ ఇప్పుడు అదే సమస్యగా మారిందని వినికిడి.హారిక హాసిని సంస్థ పతాకంపై నితిన్, సమంత తదితరులతో త్రివిక్రమ్ ఓ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసింది.

ఇప్పుడు ఆ సినిమా దాదాపు పూర్తికావచ్చింది.ఆల్ మోస్ట్ అయిపోయినట్లే.

కానీ సినిమా పాటల వ్యవహారం మాత్రం వుండిపోయిందని తెలుస్తోంది.

పాటలు చిత్రీకరించాలంటే, సాంగ్స్ కావాలి.

కానీ అవి ఇంకా రికార్డింగ్ కాలేదని టాక్.అసలు ఇంతవరకు ఆ సినిమా సంగీతానికి సంబంధించిన వర్క్ ప్రారంభం కాలేదని, దానికి కారణం సంగీత దర్శకుడు అనిరుధ్ ఫుల్ బిజీ కావడమే అని తెలుస్తోంది.

తమిళ వివాదాస్పద పాట ‘ బీప్ సాంగ్’ వివాదం లో ఇరుక్కున్నాడు అనిరుధ్.ఈ పాట గురించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.

మరి ఈ సినిమాకి ట్యూన్ లు ఎప్పుడు ఇస్తాడో , సాంగ్స్ రికార్డింగ్ ఎప్పుడో తెలియడం లేదు.ఇవన్నీ అయ్యాక పాటల చిత్రీకరణ సాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube