టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటేనే ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉంటాయి.ఈయన సినిమాలలో పంచులు, ప్రాసలతో పాటు హీరోకి సరికొత్త పేర్లు, స్టోరీలో ఇద్దరు హీరోయిన్లు వంటివి కామన్ గా ఉంటాయి.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు కూడా ఇళ్లను చాలా ప్రత్యేకంగా చూపిస్తారు.ఇలా త్రివిక్రమ్ సినిమాలలో ఇంటికి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది.
కథ మొత్తం కూడా ఆ ఇంటిలోనే కొనసాగుతూ ఉంటుంది.
ఇప్పటికే ఈయన దర్శకత్వంలో వచ్చిన అతడులో పార్థు ఇల్లు, అఆలో ఆనంద్ విహారి ఇల్లు, అత్తారింటికి దారేదిలో సునంద ఇల్లు, సన్నాఫ్ సత్యమూర్తిలో దేవరాజ్ ఇల్లు, అలా వైకుంఠపురంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటిని ప్రత్యేకంగా చూపించారు.
ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో ఇల్లు సెంటిమెంట్ తప్పనిసరిగా ఉంటుంది.ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమా విషయంలో కూడా మరోసారి ఇంటి సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టు సమాచారం.

మహేష్ బాబు సినిమా కోసం త్రివిక్రమ్ స్పెషల్ గా ఇంటిని భారీ హంగులతో సెట్ వేయబోతున్నారని సమాచారం.ఇలా మహేష్ బాబు సినిమాలో ఆయన సెంటిమెంట్ ఫాలో అవ్వడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.ఈ విధంగా తన కథకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాలో ఇంటిని త్రివిక్రమ్ రూపొందించనున్నారట.
ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా SSMB 28 పేరుతో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు.