నేను రెడీ అంటోన్న త్రివిక్రమ్.. మరి హీరో?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా త్రివిక్రమ్ తీర్చిదిద్దడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

 Trivikram Completed Script Work For Ntr, Trivikram, Ntr, Ntr30, Rrr, Tollywood N-TeluguStop.com

ఇక థమన్ అందించిన సంగీతం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంతో, అల వైకుంఠపురములో చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ కూడా చేశారు.అయితే ఈ సినిమాలో తారక్ నటించేందుకు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను ముగించుకోవాల్సి ఉంది.దీంతో త్రివిక్రమ్ తన సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను పూర్తి చేశాడు.డైలాగ్ వర్షన్‌తో పాటు కథలో కావాల్సిన మార్పులు చేర్పులు కూడా త్రివిక్రమ్ పూర్తి చేయడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించి, పూర్తి చేయాలని చూస్తున్నాడు.

అయితే ఇప్పుడు త్రివిక్రమ్ రెడీ అయినా కూడా తారక్ మాత్రం ఇంకా ఈ సినిమా కోసం రెడీగా లేడు.

ఆర్ఆర్ఆర్ చిత్రం అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమాలో తారక్ నటించే పోర్షన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

దీంతో త్రివిక్రమ్ సినిమాకు ఆయన అనుకున్న డేట్స్‌ను ఇవ్వలేకపోతున్నాడు.అయితే త్రివిక్రమ్ తారక్‌తో చేయబోయే చిత్రం తరువాత మరో రెండు ప్రాజెక్టులను క్యూలో పెట్టాడు.వాటిని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే, ముందు తారక్ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిందే అని ఆయన భావిస్తున్నాడు.అందుకే స్క్రిప్టు పనులను పూర్తి చేసిన త్రివిక్రమ్, తారక్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube