సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకుంది.రెండు వందల కోట్ల వసూళ్లతో దుమ్ము రేపుతున్న ఈ చిత్రంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ తదుపరి చిత్రం గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మొన్నటి సంక్రాంతికి అల వైకుంఠపురంలో చిత్రంతో బన్నీకి సక్సెస్ ఇచ్చిన త్రివిక్రమ్ వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడు అంటున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.ఆ చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు.ఆ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు.ఇలాంటి సమయంలో త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ మూవీ అని అది సంక్రాంతికి వస్తుందని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉంది.
ఇలాంటి విచిత్రమైన ప్రకటనలు మరియు వార్తలు ఎలా వస్తాయో అర్థం కావడం లేదు.ప్రస్తుతం త్రివిక్రమ్ తదుపరి చిత్రం గురించి ఆలోచించే మూడ్ లోనే లేడు.
ఎందుకంటే త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో చిత్రం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.