మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని తెరకెక్కించగా అది సంక్రాంతి బరిలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన స్టయిల్లో తెరకెక్కించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమాతో త్రివిక్రమ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో చూపించడంతో, ప్రేక్షకులు ఆయన నెక్ట్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే స్టార్ట్ చేశాడు.
ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన శైలి కథతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యాడు.
అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ అయ్యేందుకు చాలా ఆలస్యం కానుండటంతో ఎన్టీఆర్ 30వ చిత్ర కథలో భారీ మార్పులు చేస్తున్నాడట.
తారక్ పాత్రను మరింత ఎలివేట్ చేసేందుకు త్రివిక్రమ్ చేస్తున్న మార్పులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
‘అయినను పోయి రావలే హస్తినకు’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.