ఎన్టీఆర్ సినిమా కోసం కథలో కీలక మార్పులు చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Trivikram Change Story For NTR Movie, Tollywood, Telugu Cinema, South Cinema, RRR Movie, Pan India Movie

నందమూరి ఫామిలీ నుంచి బాలయ్య తర్వాత స్టార్ హీరోగా తనకంటూ ఒక స్థానం క్రియేట్ చేసుకున్న నటుడు జూనియర్ ఎన్ఠీఆర్.అంత ఫామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా స్వశక్తితో పైకి ఎదిగిన ఎన్ఠీఆర్ తనలోని నటుడుని సంపూర్ణంగా ఆవిష్కరించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఉత్తమ నటులలో ఒకడుగా ఉన్నాడు.

 Trivikram Change Story For Ntr Movie, Tollywood, Telugu Cinema, South Cinema, Rr-TeluguStop.com

నవరసాలు సునాయాసంగా పలికించడంతో పాటు డాన్స్, యాక్షన్ లో కూడా తనకి తిరుగులేదని వరుస సక్సెస్ లతో నిరూపించాడు.అలాగే తన లుక్ ని ఎవరూ ఊహించని విధంగా మార్చుకొని ఇప్పుడు పెర్ఫెక్ట్ హీరోయిక్ లుక్ లోకి వచ్చేసాడు.

తెలుగులో ఇప్పుడున్న స్టార్ హీరోలలో టాప్ వరుసలో ఉండే ఎన్ఠీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా తన సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాడు.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరాం భీమ్ పాత్రలో ఎన్ఠీఆర్ కనిపించబోతున్నాడు.

ఇక ఇప్పటికే రామ్ చరణ్ కి సంబందించిన క్యారెక్టర్ టీజర్ లో ఎన్ఠీఆర్ వాయిస్ ఓవర్ తో అందరిని ఆకట్టుకున్నాడు.ఇక ఈ సినిమాతో ఎన్ఠీఆర్ రేంజ్ మారిపోవడం గ్యారెంటీ.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎన్ఠీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా కూడా త్రివిక్రమ్ స్టైల్ లో నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది.

అయితే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్ఠీఆర్ ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది.ఈ ప్రభావం త్రివిక్రమ్ సినిమా మీద కూడా పడే అవకాశం ఉంటుంది.నెక్స్ట్ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే అభిమానులు కోరుకుంటారు.త్రివిక్రమ్ తెలుగు నేటివిటీతో సినిమాలు తీయడం అలవాటు.

అయితే మొదటి సారి ఎన్ఠీఆర్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథని పాన్ ఇండియా రేంజ్ లోనే కథ ఉండే విధంగా మార్పులు చేస్తున్నారని తేలుతుంది.బాలీవుడ్ లో యాష్ చోప్రా బ్యానర్ లో వచ్చే కుటుంబ నేపధ్య చిత్రాల తరహాలో ఎన్ఠీఆర్ సినిమా కథని త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube