థియేటర్‌ కొనుగోలు చేసిన త్రివిక్రమ్‌  

Trivikram Buys Cinemax Theater-trivikram,trivikram Srinivas

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే మోస్ట్‌ వాంటెడ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇండస్ట్రీలోనే టాప్‌ పెయిడ్‌ డైరెక్టర్‌ ఈయన. తన ప్రతి సినిమాకు కూడా భారీగానే వసూళ్లు చేస్తున్న త్రివిక్రమ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో బాగానే ఆస్తులు సంపాదించినట్లుగా తెలుస్తోంది..

థియేటర్‌ కొనుగోలు చేసిన త్రివిక్రమ్‌-Trivikram Buys Cinemax Theater

ఇప్పటికే హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో కోట్ల రూపాయల భూములు కొనుగోలు చేసిన త్రివిక్రమ్‌ తాజాగా ఒక థియేటర్‌ను కూడా కొనుగోలు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈస్ట్‌ గోదావరి జిల్లా రాజా నగరంలోని రాయుడు అనే థియేటర్‌ను త్రివిక్రమ్‌ కొనుగోలు చేశాడట. ఆ థియేటర్‌ చాలా ఓల్డ్‌ అయినా కూడా త్రివిక్రమ్‌ద ఆదాపుగా 4.85 కోట్ల వరకు పెట్టినట్లుగా తెలుస్తోంది. మరో కోటి రూపాయలు పెట్టి దాన్ని రీ మోడలింగ్‌ చేయిస్తున్నాడట. ప్రస్తుతం ఆ థియేటర్‌ స్థానికంగా ఒకతను నిర్వహిస్తున్నాడు.

దాన్ని త్రివిక్రమ్‌ కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆయనకే మెయింటెన్స్‌కు అప్పగించినట్లుగా తెలుస్తోంది..

త్రివిక్రమ్‌ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. అందుకే ఈ థియేటర్‌ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

కేవలం నిర్మాతలు మాత్రమే థియేటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కాని త్రివిక్రమ్‌కు ఆ కోరిక కలిగింది. ముందు ముందు మరిన్ని థియేటర్లు కొనుగోలు చేస్తాడేమో చూడాలి.