భీష్మపై మంత్రం వేస్తున్న మాంత్రికుడు  

Trivikram As Chief Guest For Bheeshma Pre Release Event - Telugu Bheeshma, Nithiin, Pre Release Event, Telugu Movie News, Trivikram

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో నితిన్ మరోసారి అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.

Trivikram As Chief Guest For Bheeshma Pre Release Event

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 21న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

భీష్మ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ రానున్నట్లు తెలుస్తోంది.గతంలో నితిన్‌తో ఆయన తెరకెక్కించిన ‘అ ఆ’ చిత్రం ఎలాంటి బ్లాక్‌బస్టర్ అందుకుందో అందరికీ తెలిసిందే.ఆ సినిమా సమయంలో నితిన్‌పై ప్రత్యేక ఇష్టం ఏర్పడిన త్రివిక్రమ్, నితిన్ ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా రావాలని కోరడంతో ఆయన వెంటనే ఓకే అన్నారట.

రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు