హ్యాట్రిక్‌పై కన్నేసిన క్రేజీ కాంబో

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్టింగ్‌కు త్రివిక్రమ్ టేకింగ్ తోడుకావడంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

 Trivikram And Thaman To Join For Third Time-TeluguStop.com

ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో తారక్ సినిమాను అదిరిపోయే రీతిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ మాటల మాంత్రికుడు.

ఇందులో భాగంగా ఈ సినిమాకు మ్యూజిక్ పరంగా థమన్ తన గత రెండు చిత్రాలకు అదిరిపోయే సంగీతం అందించడంతో ఈ సినిమాకు కూడా అతడినే వినియోగించుకోనున్నాడు.దీంతో ముచ్చటగా మూడోసారి థమన్‌తో కలిసి త్రివిక్రమ్ చేయబోయే మ్యాజిక్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ కాంబోలో రాబోయే సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి తనకు బాగా కలిసొచ్చిన కాంబోను సెట్ చేసుకుని మరీ త్రివిక్రమ్ మనముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube