త్రివిక్రమ్ మటల మాంత్రికుడిగా తెలుగు సినిమాకు పరిచయం అయిన రైటర్.తన అద్భుతమైన పంచ్ డైలాగులతో సినిమా పరిశ్రమలో కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు.
ఆయన ఓ సినిమాకు డైలాగులు రాశాడంటే మంచి హిట్ కొట్టడం ఖాయం అనే ముద్ర తెలుగు సినిమా పరిశ్రమలో పడిపోయింది.అద్భుత డైలాగ్ రైటర్ గా క్రేజ్ సంపాదించిన త్రివిక్రమ్ఆ తర్వాత దర్శకుడిగా మారాడు.
పలు సూపర్ డూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించాడు.అయితే త్రివిక్రమ్ తో కలిసి మెగాస్టార్ చాలా కాలంగా ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాడు.
గతంలో ప్రకటించాడు కూడా.కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరెక్కిన సూపర్ డూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురములో.
సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యాడు.ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తాడనే టాక్ నడుస్తొంది.చిరంజీవితో సినిమా చేస్తాడో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది.అటు చిరంజీవి కూడా చాలా బిజీగా ఉన్నాడు.
కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి తర్వాతి 5 సినిమాలకు సంబంధించి యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తున్నాడు.అందులో సుజిత్, బాబీ, హరీష్ శంకర్ లాంటి దర్శకులున్నారు.దీంతో వచ్చే నాలుగు సంవత్సరాల వరకు చిరు ఖాళీగా ఉండే అవకాశం లేదు.ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్ తో జతకడుతున్నాడు.ఆ తర్వాత బాబీతో కామెడీ మూవీకి సిద్ధం అయ్యాడు.మెహర్ రమేష్ కూడా తనకు కథ చెప్పినట్లు వెల్లడించాడు.
గతంలో రాంచరణ్ మూవీ వినయ విధేయ రామ సక్సెస్ మీట్ లో చిరంజీవి, త్రివిక్రమ్ పాల్గొన్నారు.ఆ వేదిక మీది నుంచే త్రివిక్రమ్ తో సినిమా చేస్తానని చిరంజీవి చెప్పాడు.దీనికి నిర్మాతగా దానయ్య ఉంటాడని చెప్పాడు.కానీ ప్రస్తుతం ఆయనతో సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు.అయితే చిరు కావాలనే ఆయనతో సినిమా చేయడం లేదా? లేక వీరిద్దరి మధ్య ఎక్కడైనా తేడా కొట్టిందా? అనే టాక్ ప్రస్తుతంతో సినిమా పరిశ్రమలో నడుస్తోంది.