రిలీజ్‌కు ఆరు నెలలు టైం ఉన్న సినిమాకు అప్పుడే డబ్బింగ్‌ ఏంటీ గురూజీ?  

Trivikram And Allu Arjun Movie Is Now Under Dubbing-allu Arjun New Movie,tollywood Gossips,trivikram And Allu Arjun Movie

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా సగం కూడా పూర్తి కాకుండానే అప్పుడే డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలు పెట్టినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించాడు..

రిలీజ్‌కు ఆరు నెలలు టైం ఉన్న సినిమాకు అప్పుడే డబ్బింగ్‌ ఏంటీ గురూజీ?-Trivikram And Allu Arjun Movie Is Now Under Dubbing

డబ్బింగ్‌ కార్యక్రమాలను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సాదారణంగా అయితే షూటింగ్‌ మొత్తం పూర్తి చేసిన తర్వాత డబ్బింగ్‌ చెప్పిస్తారు. కాని ఈమద్య కాస్త ముందుగానే చెబుతున్నారు.

త్రివిక్రమ్‌ మాత్రం విడుదలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే డబ్బింగ్‌ చెప్పించడం ఆశ్చర్యంగా ఉంది. షూటింగ్‌ ఇప్పటి వరకు జరిగింది తీసుకుంటే బన్నీ రెండు మూడు గంటల్లోనే డబ్బింగ్‌ చెప్పేయవచ్చు. వెంట వెంటనే డబ్బింగ్‌ చెప్పించడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ గురూజీ అంటూ సోషల్‌ మీడియాలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈవిషయం గురించి సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.

అల్లు అర్జున్‌ మరియు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఇప్పటి వరకు జులాయి మరియు సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. మరి ఆ చిత్రాల మాదిరిగా ఈ చిత్రం కూడా సూపర్‌ హిట్‌ అవుతుందా అనేది చూడాలి. ఇంకా ఫస్ట్‌లుక్‌ కాని, టైటిల్‌ను కాని రివీల్‌ చేయని చిత్ర యూనిట్‌ సభ్యులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది..

దసరాకు టీజర్‌ను విడుదల చేస్తారట. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.