మళ్ళీ కలిసిన త్రివిక్రమ్, అల్లు అర్జున్... ఈ కాంబో సెట్ అయ్యిందా ?

అటు సినిమా అయినా.రియల్‌ లైఫ్‌ అయినా.

 Trivikram, Allu Arjun , Tollywood, Rapido Ad,latest News-TeluguStop.com

అన్నింటిలోనూ చాలా చక్కగా బ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్న హీరోలు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు.సినిమాలు, షూటింగ్‌లు, ఆడియో రిలీ‌జ్‌లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే వారు సైతం మరో ఆధారం కోసం ఎదురుచూసేవాళ్లే.

కొందరు తమ ఇమేజ్‌ను పెంచుకునేందుకు చూస్తే.మరికొందరు సంపాదన కోసం.

ఇలా ఏదో ఒక విధంగా ఓ వైపు ఆదాయం వస్తున్నా.మరొక దానికోసం చూస్తూనే ఉండడం.సహజం

ఇప్పుడే అదే బాటలో నడుస్తున్నారు మన స్టార్ హీరోలు.కమర్షియల్ యాడ్‌లలో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తూ.ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు .యాడ్స్ అంటే చాలు గుర్తుకు వచ్చే నటుడు. మహేష్ బాబు. తాజాగా ఏకంగా తన ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఆయన ఓ యాడ్‌లో నటించేశాడు.అలా మహేష్ బాబు యాడ్ల సంపాదన కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూంటుంది.ఇక అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు సైతం పలు ఉత్పత్తులు, సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌లా ఇప్పటికే వ్యవహరిస్తున్నారు.

Telugu Allu Arjun, Rapido Ad, Tollywood, Trivikram-Movie

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ర్యాపిడోతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.అది కూడా మాటల మాంత్రికుడు దర్శకత్వంలోనే నటిస్తున్నాడు.యాడ్స్‌ను తెరకెక్కించడంతో త్రివిక్రమ్ స్టైలేవేరు.గతంలో మహేష్ బాబుతోనూ ఓ యాడ్ చేశాడు త్రివిక్రమ్.ఇంతకుముందు బన్నీతో ఆహా కోసం ప్రమోషనల్ యాడ్ కూడా చేశాడు.మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ బన్నీ కలిసి ర్యాపిడో కోసం ఇలా ముందుకు వచ్చారు.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో అంటూ హ్యాట్రిక్ కొట్టేసిన వీళ్లిద్దరూ.ఇప్పుడు ర్యాపిడో యాడ్‌తో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.ఈ మేరకు షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ బయటకు వచ్చింది.ప్రస్తుతం అందులో బన్నీ కొత్త లుక్కులో కనిపిస్తున్నారు.

అయితే ఇందులో పుష్ప సినిమా కోసం పెంచిన గడ్డం, జుట్టును కాస్త స్టైలీష్‌గా మార్చేశారు.సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంతో ఈ ఏడాది బన్నీ మరోసారి రచ్చ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube