ఆ రెండు సినిమాలను మిక్స్‌ చేస్తే వచ్చిందే 'అల వైంకుఠపురంలో'  

Trivikram Ala Vaikuntapuram Movie Latest Update-trivikram,trivikram Movie Copy Like A Malayalam Movie My Boss

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన జులాయి మరియు సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి.కనుక వీరి కాంబోలో రాబోతున్న అల వైకుంఠపురంలో సినిమా హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అంటూ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు.

Trivikram Ala Vaikuntapuram Movie Latest Update-trivikram,trivikram Movie Copy Like A Malayalam Movie My Boss Telugu Tollywood Movie Cinema Film Latest News-Trivikram Ala Vaikuntapuram Movie Latest Update-Trivikram Copy Like A Malayalam My Boss

భారీ ఎత్తున అంచనాలున్న అల వైకుంఠపురంలో సినిమాను రెండు సినిమాలను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని త్రివిక్రమ్‌ తెరకెక్కించినట్లుగా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

త్రివిక్రమ్‌ ఎప్పుడు ఏ సినిమా చేసినా కూడా విమర్శలు లేదంటే కాపీ అంటూ కామెంట్స్‌ వస్తూనే ఉంటాయి.అలాగే అల వైంకుఠపురంలో సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది.మలయాళ మూవీ మై బాస్‌ మరియు తెలుగు పాత చిత్రం ఇంటిగుట్టు అనే రెండు చిత్రాల కథను మిక్స్‌ చేసి మిక్సీలో వేసి కొత్త కథను త్రివిక్రమ్‌ రాసినట్లుగా సమాచారం అందుతోంది.

పవన్‌ కళ్యాణ్‌తో గతంలో ఈయన తీసిన అజ్ఞాత వాసి మరియు ఇంకా కొన్ని సినిమాలు కూడా కాపీ అంటూ తేలిన విషయం తెల్సిందే.

ఒకప్పుడు త్రివిక్రమ్‌ అంటే చాలా గౌరవం ఉండేది.

ఆయన కథ మరియు డైలాగ్స్‌ బాగా పండేవి.కాని ఇప్పుడు ఆయన కథలు అన్ని కూడా కాపీ అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

దాంతో అల వైకుంఠపురంలో సినిమాకు కాస్త బజ్‌ తగ్గినట్లయ్యింది.హ్యాట్రిక్‌ కొట్టాలనుకుంటున్న ఈ కాంబోకు ఈ వార్తలు ఇబ్బందిని కలిగిస్తున్నాయి.

అయితే సినిమా సక్సెస్‌ అయితే ఇవేవి కూడా పెద్దగా పట్టించుకోరు.

తాజా వార్తలు

Trivikram Ala Vaikuntapuram Movie Latest Update Related....