ఐదేండ్ల క్రితం పొట్టి వాడంటూ ఎగ‌తాలి చేశారు.. ఇప్పుడు బాహుబలిలా మారాడు..

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఏదో ఒక స‌మ‌యంలో కొన్ని రకాల అవ‌మానాలు ఎదుర్కొంటారు.అది చేసే ప‌ని విష‌యంలో కావ‌చ్చు.

 Tristyn Lee Once Got Humiliated Now He Has Become Like Bahubali Details, Body Bu-TeluguStop.com

లేదంటే కొన్ని సార్లు శ‌రీర ఆకృతి విష‌యంలో కూడా ఇలాంటి ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటారు.అయితే ఇలాంటి విమ‌ర్శ‌లు విన్న చాలామంది కుంగిపోతుంటారు.

కానీ కొంద‌రు మాత్ర‌మే అలాంటి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడ‌తూ.అంచెలంచెలుగా మార్పు చెందుతారు.

ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో నిల‌బ‌డుతారు.మ‌న‌ల్ని విమ‌ర్శించే ప్ర‌తి ఒక్క‌రికీ మ‌నం సమాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

మ‌న విజ‌య‌మే పెద్ద స‌మాధానంగా వినిపిస్తుంది.

అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వ్య‌క్తి గురించే మీకు చెప్ప‌బోతున్నాం.

అమెరికాలో నివ‌సించే ట్రిస్టిన్ లీ జీవితంలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కున్నారు.అయితే తాను 15 ఏండ్ల వయస్సులో ఫుడ్ బాల్ ప్లేయర్ అవ్వాల‌ని అనుకుంటే.

మ‌ధ్య‌లో అత‌ను పొట్టిగా ఉండ‌టంతో అంద‌రూ ఎగ‌తాళి చేసేవారు.దీంతో వాటిని చాలెంజింగ్ తీసుకున్న లీ… హార్డ్ వ‌ర్క్ చేసి ఫ్రొఫెషనల్ బాడీ బిల్డర్ గా ఎదిగాడు.15 ఏండ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు లీ చాలా పొట్టిగా ఉండేవాడు.కానీ 19 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి మాత్రం ప్రొఫెష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్ గా ఎద‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ఇప్పుడు అత‌ని బాడీని చూసి ఒక‌ప్పుడు న‌వ్విన వారే.ఇప్పుడు వావ్ అంటున్నారు.ఒక‌ప్పుడు చీపురు పుల్ల‌లా ఉండే వ్య‌క్తి.ఇప్పుడు ఇనుములా మారిపోయాడు.ఇక లేటెస్ట్ లుక్స్ ఇన్‌స్టాగ్రామ్ లో విప‌రీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి.దీంతో అత‌ను ఇప్పుడు యూత్‌కు ఐకాన్ లాగా మారిపోయాడు.

క‌ష్ట‌త‌రం కానిదేమీ ఉండ‌ద‌ని, హార్డ్ వ‌ర్క్ చేస్తే క‌చ్చితంగా అనుకున్న‌ది సాధిస్తామ‌ని నిరూపించాడు ట్రిస్టిన్ లీ. లీ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ కాక‌పోయినా.అంత‌టి ఫేమ్‌ను సంపాదించుకున్నాడు.ఏదేమైనా కూడా లీ చేసిన ప‌ని అంద‌రికీ ఓ పెద్ద గుణ‌పాఠంలా ఉంద‌ని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube