తమిళ్ జెర్సీలో హీరోయిన్ గా త్రిష

న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా నానిని నటుడుగా మరింత ఎత్తుకి తీసుకుపోయింది.

 Trishna Play As A Heroine In Jersey Tamil Remake, Natural Star Nani, Vishnu Vish-TeluguStop.com

కొడుకు ప్రేమ కోసం చనిపోతానని తెలిసిన కూడా లేటు వయసులో క్రికెట్ ఆడిన పాత్రలో నాని న్యాచురల్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా అయిపోయారు.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతుంది.అక్కడ కూడా ఒరిజినల్ చేసిన గౌతమ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా తమిళ రీమేక్ కి రంగం సిద్ధం అయ్యింది తెలుగులో నాని చేసిన పాత్రలో యువ హీరో విష్ణు విశాల్ నటిస్తున్నాడు.త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

ఇక తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన హీరోయిన్ పాత్ర కోసం తమిళంలో త్రిష చేయడానికి ముందుకి వచ్చినట్లు తెలుస్తుంది.హీరోయిన్ పాత్రకి కూడా సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది.

ఖాళీగా ఉన్న భర్తని భరించలేక ప్రతిరోజు అతనితో గొడవ పడే భార్యగా ఇందులో ఆమె పాత్ర ఉంటుంది.అలాగే ఇందులో బాబుకి తల్లిగా నటించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో ముందుగా ఈ పాత్ర కోసం నయనతార, అమలాపాల్ వంటి హీరోయిన్లని అనుకున్న వారు నటించడానికి ఆసక్తి చూపించలేదు.తాజాగా ఈ పాత్ర చేయడానికి త్రిష ముందుకు వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

ఆమెకు పాత్ర బాగా నచ్చడంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పేసుకుందట.త్రిష టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆమె ఈ సినిమాలో చేస్తే కచ్చితంగా పాత్రకి ప్రాణం పోస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube