అమెరికాలో భారీ స్థాయిలో త్రిశక్తి యాగం..!!!

భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు.భారతదేశంలోని హిందువులంతా పూజా వ్యవహారాలను ఎంతో నిష్టగా పాటిస్తారు.

 Trishakti Yaagam In America-TeluguStop.com

ఏ దేశంలో నివసిస్తున్న సరే భారతీయులలో పూజా వ్యవాహారాలను గౌరవించే భావం మాత్రం మారదు.ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.

అదే విధంగా, అమెరికాలోని కాలిఫోర్నియాలో లివర్ మోర్ నగరంలో ఉన్న శివ-విష్ణు ఆలయంలో త్రిశక్తి యాగాన్ని నివార్వహించడానికి నిర్వాహకులు నిర్ణయించుకున్నారు.అయితే ఈ యాగం మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు జరుగనుందని ప్రకటించారు.

నాలుగు రోజుల పాటు జరిగే ఈ యాగం లో అమ్మవారిని త్రిశక్తి స్వరూపిణిగా దర్శిస్తూ, భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.ఈ మహాత్కర కార్యక్రమానికి భక్తులందరు తప్పక తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.

యాగానికి సంబంధించిన వివరాలు…

వేద పండితుల సమక్షంలో 5 కాలాల్లో అనగా.శ్రీ సూక్తం, ధర్మా సూక్తం, మేధా సూక్తం 1440 సార్లు పఠిస్తూ యాగాన్ని నిర్వహించాలని సంకల్పించుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు.నాలుగు రోజులపాటు విశేష పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించానున్నారట.1008 మంది మహిళలతో, అమ్మవారికి ప్రీతిపాత్రమైన సహస్ర సువాహిని పూజను నిర్వహిస్తున్నారు.కావునా బే ఏరియాలో ఉన్న మహిళలంతా ఈ పూజా కార్యక్రమాలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.దీనిలో భాగంగానే.

Telugu America, Livermore, Shivavishnu, Telugu Nri, Trishaktiyaagam-Telugu NRI

గణపతి పూజ, విశ్వక్సేన పూజ, పుణ్య వచనం,పంచగవ్య ప్రసన్నం, కూష్మాండ హోమం, భూమిపూజ, వాస్తు హోమం, యాగశాల ప్రవేశం, అభిషేకం, మహా పూర్ణాహుతి ఇంకా తదితర పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ప్రవాస భారతీయులందరు ఈ కార్యక్రామానికి విచ్చేయాలని హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ విజ్ఞప్తి చేసింది.ఇంకా ఈ త్రిశక్తి యాగానికి సంబంధించిన వివరాలను, సహస్ర సువాహిని పూజకు రిజిస్ట్రేషన్, వాలంటీర్ రిజిస్ట్రేషన్ వివరాలకై కింద పొందుపరిచిన వెబ్ సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు.https://livermoretemple.org/hints/trishakti-yaagam/index.html#featured

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube