వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన త్రిష… వారి దారిలోనే  

Trisha Green Signal To Act in Web Series, Tollywood, Kollywood, South Cinema, Telugu Cinema, Heroines, OTT Platform - Telugu Heroines, Kollywood, Ott Platform, South Cinema, Telugu Cinema, Tollywood, Trisha Green Signal To Act In Web Series

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఎంటర్టైన్మెంట్ అంతా థియేటర్ నుంచి డిజిటల్ లోకి వెళ్లిపోయింది.ఇకప్పుడు కేవలం కాలక్షేపం కోసం మాత్రమే డిజిటల్ ఎంటర్టైన్మెంట్స్ ని ఉపయోగించేవారు.

 Trisha Web Series Tollywood

అయితే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేమికులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి అలవాటు పడిపోయారు.ఇక చిన్న నిర్మాతల నుంచి పెద్ద నిర్మాతల వరకు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ లో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

థియేటర్లో వచ్చే మజా ఓటీటీలో రాదని కొంత మంది చెబుతున్న వారు కూడా ఎక్కువ కాలం ఆ మాట మీద ఉండే పరిస్థితి కనిపించడం లేదు.ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఓటీటీ తప్ప మరో ప్రత్యామ్నాయం సినిమావాళ్ళకి కనిపించడం లేదు.

వెబ్ సిరీస్ కి ఓకే చెప్పిన త్రిష… వారి దారిలోనే-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యంలో ఇక సినిమాలలో స్టార్ హీరోయిన్స్ గా చేసి కెరియర్ లో ముగింపు దశకి వచ్చేనా ముదురు భామలు అందరూ కూడా ఓటీటీలో వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు.భవిష్యత్తులో వాటికి మంచి డిమాండ్ ఉండటంతో ఇప్పటి నుంచే తమ బెర్త్ స్టాండింగ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అందులో భాగంగానే డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కే వెబ్ సిరీస్ లలో నటించడానికి ఒకే చెబుతున్నారు.ఇప్పటికే కాజల్, సమంత వంటి బిజీ తారలు సైతం వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ నటి త్రిష కూడా వెబ్ సీరీస్ పట్ల ఆసక్తి చూపుతోంది.తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె కమిట్ అయినట్టు తెలుస్తోంది.

ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ కి రామ సుబ్రహ్మణ్యన్ దర్శకత్వం వహిస్తారు.తండ్రీ కూతుళ్ల మధ్య నడిచే కథతో భావోద్వేగాల సమ్మిళితంగా ఇది రూపొందుతుందని తెలుస్తుంది.

ఈ వెబ్ సిరీస్ లో త్రిష తండ్రి పాత్రలో ప్రముఖ స్టార్ నటుడు కనిపిస్తాడని సమాచారం.

#OTT Platform #Kollywood #Heroines

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trisha Web Series Tollywood Related Telugu News,Photos/Pics,Images..