తీరబోతున్న త్రిష కోరిక  

Trisha To Play Negative Role In Dhanush’s Next -

హాట్ బ్యూటి త్రిష 30 సినిమాలకు పైగానే చేసినా ఎక్కడో ఎదో అసంతృప్తి.త్రిష చేసినవన్నీ దాదాపు గ్లామర్ పాత్రలే.

ఆకాశమంత,నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి కొన్ని సినిమాలు వదిలేస్తే నటిగా తనని తానూ సంతృప్తి పరచుకునే పాత్రలు పెద్దగా చేయలేదు త్రిష.కొత్త కొత్త పాత్రలు ప్రయత్నించాలని త్రిష ఆశ.మరీ ముఖ్యంగా నెగెటివ్ క్యారెక్టర్ చేయడం అనేది త్రిష చిరకాల కోరిక.మొత్తానికి ఈ అమ్మడి కోరిక తీరబోతోంది.

Trisha To Play Negative Role In Dhanush’s Next--Telugu Tollywood Photo Image

విషయం ఏమిటంటే, తమిళ డైరెక్టర్ దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా త్వరలో ఓ చిత్రం ఆరంభం కానుంది.ఇందులో ధనుష్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు.

అన్న పాత్ర సరసన త్రిషను ఎంపిక చేశారట.తమ్ముడి పాత్ర సరసన ‘షామిలి’ (‘ఓయ్’ చిత్రం ఫేం) ఆడిపాడనుంది.

ఇందులో త్రిష పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుందట.నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర అని వినికిడి.

మరి తనకు రాక రాక వచ్చిన అవకాశాన్ని త్రిష ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trisha To Play Negative Role In Dhanush’s Next Related Telugu News,Photos/Pics,Images..