ఆ విషయంలో నిర్మాతలను నేను కావాలని ఇబ్బంది పెట్టలేదు: త్రిష  

Actress trisha says she dont want to problem with producers Trisha, Tamil, Movie Producers, Trisha Marriage, Lady Oriented Movies, Ram, Mohan lal, Trisha Movie Shooting Update - Telugu @trishtrashers, Actress Trisha Says She Dont Want To Problem With Producers, Lady Oriented Movies, Mohan Lal, Movie Producers, Ram, Tamil, Trisha, Trisha Marriage, Trisha Movie Shooting Update

త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దాదాపుగా 20 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి అందరినీ మెప్పించింది.

TeluguStop.com - Trisha Says She Dont Want To Problem With Producers

చెన్నైకు చెందిన ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటించి అందరిని మెప్పించింది.కానీ ఈ మధ్య కాలంలో అవకాశాలు రాకపోవడంతో విరామం తీసుకున్న త్రిష గురించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు కూడా వచ్చాయి.

కానీ అవన్నీ వాస్తవం కాదని తిరిగి సినిమాలో తన నటనను కొనసాగిస్తోంది.

TeluguStop.com - ఆ విషయంలో నిర్మాతలను నేను కావాలని ఇబ్బంది పెట్టలేదు: త్రిష-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ మధ్యకాలంలో త్రిషపై కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి.

ఏదైనా చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు సరైన సమయానికి రారని, షూటింగ్ పూర్తి కాకుండానే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్ళిపోతూ నిర్మాతలను చాలా ఇబ్బంది పెడుతున్నారన్న పుకార్లు వినిపించాయి.దీనిపై స్పందించిన త్రిష ఈ విషయంపై నిర్మాతలను నేను కావాలని ఇబ్బంది పెట్టలేదని తేల్చి చెప్పారు.

ఇటీవలి కాలంలో డేట్స్ చూసుకోకుండా ఒకేసారి ఇద్దరి నిర్మాతలకు సమయం ఇవ్వడంతో కొద్దిగా ఇబ్బంది పడ్డారు.కాకపోతే తన టైం అడ్జస్ట్ చేసుకుని అన్ని ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యేదాన్ని అని ఓ సందర్భంగా ఆమె తెలియజేశారు.

పెళ్లి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలపై కూడా స్పందించిన త్రిష అవి కేవలం అబద్దపు వార్తలు అని తేల్చి పడేసింది.

కాగా త్రిష ప్రస్తుతం తమిళ నటుడు మోహన్ లాల్ ప్రముఖకథా నాయకుడిగా “రామ్” అనే తమిళ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్నో విభిన్న పాత్రలలో, లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నటించి, తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.తెలుగు సినీ ప్రేక్షకులు వర్షం పడగానే ఇప్పటికీ త్రిషని గుర్తుచేసుకునే విధంగా నటించి అందరిని మెప్పించారు.

అయితే తన నటించబోయే రామ్ చిత్రం చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందేనని ఆ చిత్ర బృందం తెలిపారు.

.

#ActressTrisha #Trisha #Trisha Marriage #LadyOriented #Tamil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trisha Says She Dont Want To Problem With Producers Related Telugu News,Photos/Pics,Images..