ఆచార్య బ్యూటీకి ఎసరు పెట్టింది వాళ్లేనట!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

 Trisha Out Of Acharya Due To Fans-TeluguStop.com

ఈ సినిమాలో చిరు రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తుండగా, ఇటీవల చిరుకు సంబంధించిన లుక్‌ లీక్ కావడం మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్‌గా తొలుత త్రిషను తీసుకున్నారు.

ఆమెతో కలిసి షూటింగ్ కూడా మొదలుపెట్టేందుకు ఆచార్య యూనిట్ రెడీ అయ్యింది.అయితే ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ, ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు త్రిష ప్రకటించింది.

దీంతో చిత్ర యూనిట్ వేరే హీరోయిన్ వేటలో పడింది.అయితే అసలు త్రిష ఎందుకు ఈ సినిమా నుండి వెళ్లిపోయిందనే విషయం మాత్రం ఆసక్తికరంగా మారింది.

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ త్రిష అన్నప్పటి నుండే సోషల్ మీడియాలో పలు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.చిరు సినిమాలో ఈ ఫేడవుట్ హీరోయిన్ ఎందుకని మెగా ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేశారు.

నిజానికి త్రిష ఈ సినిమాకు సెట్ కాదని పలువురు అభిప్రాయ పడ్డారు.ఇలా మెగా ఫ్యాన్స్ త్రిష పట్ల వ్యతిరేకంగా ఉన్నారని తెలియడంతో చిత్ర యూనిట్ త్రిషను సినిమా నుండి తప్పుకోవాల్సిందిగా కోరారట.

చేసేదేమీ లేక త్రిష కూడా సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.ఇలా త్రిష ఆచార్య సినిమా నుండి వెళ్లిపోవడానికి కారణం ఏమిటనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube