మెగాస్టార్ సినిమాకి మొహం చాటేసిన త్రిష  

Trisha Out From Megastar Chiranjeevi Acharya Movie - Telugu Koratala Shiva, Ram Charan, Telugu Cinema, Tollywood,

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయిన కనీసం కథ కూడా వినకుండా వెంటనే ఒకే చెప్పేస్తుంది.అతనితో కలిసి నటించడమే అదృష్టంగా భావిస్తారు.

 Trisha Out From Megastar Chiranjeevi Acharya Movie

అవకాశం వచ్చిందంటే సంబరపడిపోతారు.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా విషయంలో రివర్స్ జరిగింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రస్తుతం ఫేడ్ అవుట్ దశలో ఉన్న త్రిషని హీరోయిన్ గా కొరటాల ఫైనల్ చేశారు.ఇక ఈ అమ్మడు తాజాగా షూటింగ్ లో కూడా పాల్గొంది.

మెగాస్టార్ సినిమాకి మొహం చాటేసిన త్రిష-Movie-Telugu Tollywood Photo Image

అయితే ఉన్నపళంగా అందరికి మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ చెప్పింది.

చిరంజీవి ఆచార్య సినిమా నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

క్రియేటివ్‌ డిఫర్సెన్స్‌ వల్ల నేను చిరంజీవిగారి ‘ఆచార్య’ సినిమాలో నటించడం లేదు.త్వరలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో నా తెలుగు అభిమానులను కలుస్తాను అని పోస్ట్ చేసింది.

అసలు చిరంజీవి సినిమాతో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చేంత సమస్య త్రిషకి ఏమొచ్చింది అంటూ ఇప్పుడు ఆ పోస్ట్ చూసిన వారు కామెంట్స్ పెడుతున్నారు.అయితే రెమ్యునరేషన్ విషయంలో అమ్మడు కాస్తా ఎక్కువ డిమాండ్ చేయడం జరిగిందని, కొరటాల దీనికి అంగీకరించలేదని, ఈ కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్లు చర్చించుకుంటున్నారు.

అయితే ఏం జరిగింది అనేది మాత్రం వాస్తవం తెలియడం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు