మీకు కాబోయే భర్త ఎవరంటూ లైవ్ లోనే త్రిషను అడిగేసిన నెటిజన్...

తెలుగులో దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి ఒకప్పుడు సార్ హీరోయిన్ల లిస్టులో మొదటి వరుసలో కొనసాగినటువంటి కోలీవుడ్ బ్యూటీ త్రిష గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు తెలుగులో ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో కెరియర్ బిజీ బిజీ గా సాగుతున్న సమయంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం కూడా చేసుకుంది.

 Trisha, Telugu Actress, Telugu Heroine, Trisha Marriage News, Tollywood-TeluguStop.com

కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఈ పెళ్లి పెటాకులైంది.దీంతో ఈ అమ్మడు ఇంక పెళ్లి గురించి కాకుండా తన సినీ జీవితం పై దృష్టి సారించింది ఇందులో భాగంగానే తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే యాక్టిివ్ గా  ఉంటూ తన అభిమానులతో అందుబాటులో ఉంటుంది.అయితే తాజాగా త్రిష తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.

ఇందులో భాగంగా ఓ అభిమాని ఏకంగా ఇప్పటికైనా మీకు కాబోయే భర్త ఎవరో చెప్పాలని ప్రశ్నించాడు.

దీంతో త్రిష తనదైన శైలిలో స్పందిస్తూ తనకు కాబోయే భర్త ఎవరో ఇంకా తనకే తెలియదని అంతేగాక ఇంకా కలవలేదని కూడా చెప్పుకొచ్చింది.

దీంతో నెటిజన్లు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ చేస్తున్నారు.అంతేగాక పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఒకసారి త్రిష దెబ్బతినడం వల్ల ప్రస్తుతం సినీ సినిమాలపైనే దృష్టి సారిస్తోందని పలువురు సినీ పరిశ్రమలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే త్రిష టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నటువంటి “ఆచార్య” అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయింది.కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం నుంచి త్రిష తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే తెలుగులో అవకాశాలు లేక పోయినప్పటికీ తమిళంలో మాత్రం ఈ అమ్మడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube