త్రిష మూవీ గురించి తమిళనాట వింత పోరాటం   Trisha Fans Demanding 96 Movie On Sun Tv For This Deepawali     2018-11-05   10:29:36  IST  Ramesh P

తెలుగు, తమిళంలో స్టార్‌ హీరోయిన్‌ అయిన త్రిష తాజాగా ‘96’ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈచిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న 96 చిత్రం అయిదవ వారంలోకి అడుగు పెట్టింది. అయినా మంచి వసూళ్లను రాబడుతూ దూసుకు పోతోంది. భారీ ఎత్తున వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రంను దీపావళి కానుకగా సన్‌ టీవీలో ప్రీమియర్‌ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సూపర్‌ హిట్‌ బ్లాక్‌ బస్టర్‌ 96 చిత్రం దీపావళి కానుకగా సన్‌ టీవీలో అంటూ యాడ్స్‌ కూడా వస్తున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 96 చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఈ చిత్రం ప్రీమియర్‌ ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీ ఉన్న చిత్రాన్ని అప్పుడే టీవీల్లో వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో బ్యాన్‌ 96 ప్రీమియర్‌ అంటూ యాష్‌ ట్యాగ్‌ తో తమిళ సినీ వర్గాల వారు పెద్ద మూమెంట్‌ ను ప్రారంభించారు.

Trisha Fans Demanding 96 Movie On Sun Tv For This Deepawali-

త్రిష ప్రారంభించిన ఈ మూమెంట్‌ ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రస్తుతం సన్‌ టీవీనే ఆలోచనల్లో పడేసిన ఈ మూమెంట్‌ పెద్ద ఎత్తున జరుగుతోంది. 96 చిత్రాన్ని దీపావళికి ప్రీమియర్‌ వేయవద్దని, ఖచ్చితంగా సంక్రాంతికి వాయిదా వేయాల్సిందే అంటూ అంతా కోరుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతల శ్రేయస్సు కోసం సన్‌ టీవీ వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఏ భాషలో కూడా ఇలాంటి వింత ఉద్యమం జరుగలేదు. ఒక సినిమాను టీవీలో ప్రసారం చేయవద్దని చెప్పడం, ఉద్యమం చేయడం ఇదే ప్రథమం.