తూచ్.. అవన్నీ పుకార్లే అంటోన్న త్రిష  

Trisha Clarifies Rumours On Telugu Movies - Telugu Acharya, Telugu Movies, Tollywood Movie News, Trisha

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్యలో తొలుత హీరోయిన్‌గా అందాల భామ త్రిషను ఎంపిక చేశారు చిత్ర యూనిట్.ఈ సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకున్న తరువాత కొన్ని కారణాల వల్ల తాను ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు త్రిష ప్రకటించింది.

 Trisha Clarifies Rumours On Telugu Movies

దీంతో ఆమెను మెగా ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు.

త్రిషకు టైం దగ్గర పడి తెలుగు సినిమాలను దూరం పెడుతుందని, ఆమె ఇక తెలుగు సినిమాల్లో నటించదు గనకే చిరంజీవి పక్కన ఛాన్స్ వద్దనుకుంది అంటూ సోషల్ మీడియాలో ఆమెపై వార్తలు వచ్చాయి.

తూచ్.. అవన్నీ పుకార్లే అంటోన్న త్రిష-Gossips-Telugu Tollywood Photo Image

ఇవి ఆమె వరకు చేరడంతో ఇలాంటి వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది.తనకు హీరోయిన్‌గా పేరొచ్చిందే తెలుగు సినిమాలతో అని, అలాంటిది తెలుగు సినిమాలను ఎందుకు వదిలేస్తానని చెప్పుకొచ్చింది.

తన బిజీ షెడ్యూల్ కారణంగా పలు తెలుగు సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని, ఇకపై తెలుగు సినిమాల్లో నటించేందుకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తానంటూ వర్షం పాప చెప్పుకొచ్చింది.ఏదేమైనా ఆచార్య సినిమా నుండి తప్పుకున్నాక త్రిషను సోషల్ మీడియాలో మామూలుగా ట్రోల్ చేయడం లేదనేది వాస్తవం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trisha Clarifies Rumours On Telugu Movies Related Telugu News,Photos/Pics,Images..