ముదురు హీరోయిన్‌కు మరో ఆఫర్

ముద్దుగుమ్మ త్రిష పుష్కర కాలంగా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే వుంది.ఈ అమ్మడికి కొంత కాలంగా ఆఫర్లు లేకుండా వున్నాయి.

 Trisha Again With Ravi Teja In Special 26 Remake-TeluguStop.com

దాంతో ఈ అమ్మడు హీరోయిన్‌గా కెరీర్‌పై ఆశలు వదిలేసుకుంది.అయితే తాజాగా ఈ అమ్మడికి తమిళంలో అజిత్ సినిమాలో మరియు తెలుగులో బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశాన్ని దకించుకుంది.

ఇప్పటికే అజిత్ సినిమా విడుదల కాగా మంచి సక్సెస్‌ను సాధించింది.ఇక త్వరలోనే బాలయ్యతో కలిసి నటిస్తున్న “లయన్” సినిమా విడుదలకు సిద్ద అవుతోంది.

ఈ నేపధ్యంలో ఈ అమ్మడు మరో ఆఫర్‌ను దక్కించుకుంది.

గతంలో ఈ అమ్మడు రవితేజతో కలిసి నటించిన విషయం తెలిసింది.“కృష్ణ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరిద్దరు త్వరలో బాలీవుడ్ రీమేక్ “స్పెషల్ 26” సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన “స్పెషల్ 26” చిత్ర రీమేక్ రైట్స్‌ను తమిళ నిర్మాత త్యాగరాజన్ దక్కించుకున్నాడు.

ఈ రీమేక్‌ను తెలుగు మరియు తమిళంలో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నాడు.ప్రస్తుతం అందుకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లుగా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube