పెళ్లిలో వీరంగం సృష్టించిన త్రిపుర కలెక్టర్‌.. చివరికి..?

కరోనా వల్ల మరోసారి పెళ్లిళ్లపై ఎఫెక్ట్‌ పడింది.గతేడాది కూడా ఇదే సమయంలో కరోనా విజృంభించడంతో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.

 Tripura Collector Shailesh Kumar Yadav Misbehavior At Wedding Ceremony-TeluguStop.com

ఆ ఏడాదంతా కరోనాతోనే సరిపోయింది.అయితే ఈ ఏడాది మొదట్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో చాలా మంది పెళ్లిళ్లు కుదుర్చుకున్నారు.

మే, జూన్‌ నెలల్లో పెళ్లిళ్ల కోసం ఇప్పటికే నిశ్చితార్థాలు కూడా పూర్తి చేసుకున్నారు.కరోనా రాకుండా ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు పెట్టినప్పటికీ చాలా మంది వాటిని పాటించడం లేదు.

 Tripura Collector Shailesh Kumar Yadav Misbehavior At Wedding Ceremony-పెళ్లిలో వీరంగం సృష్టించిన త్రిపుర కలెక్టర్‌.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా పెళ్లి చేసుకుంటున్న వారిపై ఓ కలెక్టర్ ఫైర్ అయ్యారు.పశ్చిమ త్రిపుర జిల్లా కలెక్టర్ డాక్టర్ శైలేష్ కుమార్ యాదవ్ పెళ్లి చేసుకున్నవారిని అరెస్ట్ చేయించారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పెళ్లి మండపానికి కలెక్టర్ పోలీసులతో సహా చేరుకున్నారు.కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు కోవిడ్ వ్యాప్తి కారణమయ్యారనే కారణంతో వధూవరులతో సహా మరికొంత మంది పెళ్లి వారిని అరెస్ట్ చేయించారు.

పెళ్లికి అనుమతి ఇచ్చిన రెండు ఫంక్షన్ హళ్లను ఏడాది పాటు ఎలాంటి కార్యక్రమాలు జరపకుండా సీల్ చేశారు.దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.అయితే ఈ ఘటనపై మళ్లీ తెర లేచింది.కలెక్టర్‌ శైలేష్‌కుమార్‌ యాదవ్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.కొవిడ్‌-19 అమలు చేసే ప్రయత్నంలో పెళ్లి వేడుక వద్దకు వచ్చి.కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధం అని చిందులు వేస్తూ.

పెళ్లిని నిలిపివేయించారు.అలాగే వరుడితో పాటు అక్కడే ఉన్న ఆడా మగ అని చూడకుండా పలువురిపై చేయి చేసుకున్నారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఈ క్రమంలో త్రిపుర సీఎం బిప్లబ్‌కుమార్‌ దేబ్‌ ఆదేశాల మేరకు ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయగా ఈ వారం వారు కమిటీ ఎదుట హాజరయ్యారు.

మరోవైపు కలెక్టర్ ను సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యేలు ఆషిష్‌ సాహా, సుశాంత చౌదరి సహా పలువురు బీజేపీ నేతలు త్రిపుర ప్రధాన కార్యదర్శి మనోజ్‌కుమార్‌కు లేఖ రాశారు.

#BrideAnd #Misbehavior #COVID Rules #Social Media #Mla Ashish Saha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు