కరోనా బారిన పడ్డ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..!!

గత ఆదివారం నుండి దేశంలో లక్షల్లో కొత్త కరోనా పాజిటివ్ కేసులు బయట పడుతున్న సంగతి తెలిసిందే.దీంతో ఆల్రెడీ దేశంలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్లే అనే వార్తలు వస్తున్నాయి.

 Tripura Chief Minister Tested Positive-TeluguStop.com

మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చేయడం కోసం తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి.కేసులు ఎక్కువగా బయటపడుతున్న రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ మరోపక్క వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉన్నాయి.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది కరోనా బారిన పడుతున్నారు.తాజాగా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ కూడా కరోనా బారిన పడ్డారు.స్వయంగా ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.తనకి పాజిటివ్ వచ్చినట్లు వెంటనే వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు.

 Tripura Chief Minister Tested Positive-కరోనా బారిన పడ్డ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వైద్యుల సలహాల మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి అని జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచనలు ఇచ్చారు.

  మరో పక్క ప్రధాని మోడీ రానున్న నాలుగు వారాల్లో దేశంలో కరోనా నిబంధనలు కఠినం చేసే తరహాలో సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

#Tripura #Modi #Biplab Kumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు