మాములుగా టాలీవుడ్ హీరోలకు తమ పుట్టిన రోజుకు వాళ్ళు కొత్తగా చేసే సినిమాలకు సంబంధించి టీజర్ అన్నా.లేదా ఫస్ట్ లుక్ అన్నా విడుదల చేస్తుంటారు.
అల్లువారి అబ్బాయి కూడా త్వరలో అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.ఎందుకంటే ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు.
ఈ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నాడు.
సైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా చేస్తున్నాడని మనందరికీ తెలిసిన విషయమే.
మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 13 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఏప్రిల్ 8 న తన పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సినిమా టీజర్ ను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారట.అంతేకాదు పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం లో చేయబోయే సినిమా టైటిల్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ రెండు అనౌన్స్ మెంట్స్ తో పాటుగా మరొక కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించబోతున్నట్లు టాక్.దీంతో అల్లు అర్జున్ ఫాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కొరటాల శివతో చేయబోతున్న సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని తెలుస్తుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తుంది.ఈ వార్తలు నిజమైతే అల్లు అర్జున్ ఫాన్స్ పండగ చేసుకుంటారు.