వెంకటేష్, రవితేజ సినిమాలపై త్రినాథరావు నక్కిన క్లారిటీ

మేం వయసుకి సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యి తరువాత సినిమా చూపిస్తా మామా మూవీగా గ్రాండ్ సక్సెస్ కొట్టి అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్న దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన.ఇక ఈ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నానితో నేను లోకల్ అనే సినిమాతో మరో కమర్షియల్ హిట్ ని ఈ దర్శకుడు తన ఖాతాలో వేసుకున్నాడు.

 Director Trinadha Rao Nakkina Gives Clarity On Venky And Raviteja Movies, Tollyw-TeluguStop.com

వీటి తర్వాత హీరో రామ్ తో హలో గురు ప్రేమకోసమే అనే మూవీ తెరకెక్కించారు.ఈ మూవీ ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక త్రినాధ్ రావు తెరకెక్కించిన ఈ మూడు సినిమాలకి ప్రసన్న కుమార్ కథ అందించిన సంగతి తెలిసిందే.వీరిద్దరు కలిసి విక్టరీ వెంకటేష్ కి కథ చెప్పి ఒకే చేయించుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్ లో ఆ మూవీ తెరకేక్కుతుందని అందరూ భావించారు.అయితే ఈ మూవీ ఎందుకనో సెట్స్ పైకి వెళ్ళలేదు.

అలా అని క్యాన్సిల్ అయినట్లు కూడా ఎక్కడా ప్రకటించలేదు.

అలాగే మాస్ మహారాజ్ రవితేజకి ఒక కథ చెప్పి ఒకే చేయించుకున్నారని టాక్ వచ్చింది.

ఈ మూవీని అఫీషియల్ గా నిర్మాతలు కూడా ఖరారు చేశారు.అయితే రవితేజ మాత్రం త్రినాధ్ రావుని పక్కన పెట్టి శరత్ మండవ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.

ఈ నేపధ్యంలో త్రినాధ్ రావు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయిందనే ప్రచారం తెరపైకి వచ్చింది.ఈ నేపధ్యంలో తాజాగా దర్శకుడు ఈ పుకార్లకి క్లారిటీ ఇచ్చాడు.

Telugu Trinadharao, Nenu, Prasanna Kumar, Ravi Teja, Raviteja, Sharath Mandava,

మాస్ మహారాజ్ రవితేజతో చేయబోయే సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని చెప్పాడు.ఇక రవితేజ ఎప్పుడంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.అలాగే వెంకటేష్ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని తెలిపారు.రవితేజ మూవీ తర్వాత వెంకటేష్ తో చేయబోయే సినిమా స్టార్ట్ అవుతుందని స్పష్టం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube