అనిల్ రావిపూడి కథతో త్రినాధ్ రావు సినిమా... దిల్ రాజు ప్రొడక్షన్ లో  

అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్ లు టాలీవుడ్ క్రేజీగా సెట్ అవుతూ ఉంటాయి. స్టార్ దర్శకులుగా ఉన్నవారు తక్కువ బడ్జెట్ కథలు రాసిన వాటిని తెరకెక్కించలేక వేరొక దర్శకుడుతో వాటిని తామే నిర్మాతగా మారి తెరకెక్కించడం లేదంటే వేరొక ప్రొడక్షన్ లో ఆ కథలకి దృశ్యరూపం ఇవ్వడం గాని చేస్తాని.

TeluguStop.com - Trinadh Rao Nakkina Movie With Anil Ravipudi Story

ఇప్పుడు అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఒక త్వరలో సెట్ కాబోతుంది.టాలీవుడ్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ దర్శకుడు ఎక్కువగా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తున్నాడు.

ఇక దర్శకుడుగా వరుసగా రెండు విజయాలు ఒక ఎవరేజ్ మూవీతో తనని తాను ప్రూవ్ చేసుకొని ఇప్పుడు రవితేజతో సినిమా కోసం రెడీ అవుతున్న దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన వీరిద్దరి కాంబినేషన్ లో దిల్ రాజు ఒక సినిమా సెట్ చేస్తున్నాడు.

TeluguStop.com - అనిల్ రావిపూడి కథతో త్రినాధ్ రావు సినిమా… దిల్ రాజు ప్రొడక్షన్ లో-Movie-Telugu Tollywood Photo Image

రీసెంట్ గా అనిల్ రావిపూడి తక్కువ బడ్జెట్ లో ఒక కథని దిల్ రాజుకి వినిపించడం జరిగింది.

ఈ కథ అతనికి భాగా నచ్చేయడంతో దీనిని ఒక పది కోట్ల బడ్జెట్ తో యంగ్ హీరోతో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమా దర్శకత్వ బాద్యతలు త్రినాధ్ రావు నక్కినకి అప్పగించడానికి రెడీ అవుతున్నాడు.

ఎలాగూ రవితేజ సినిమా కాస్తా లేట్ అయ్యేలానే ఉంది.ఈ నేపధ్యంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ చిన్న సినిమాని తెరకెక్కించే పనిలో త్రినాధ్ రావు కూడా పడ్డట్లు తెలుస్తుంది.

ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అనిల్ రావిపూడి అందిస్తాడని తెలుస్తుంది.అలాగే ఈ సినిమా రెవెన్యూ లో కొంత షేర్ దిల్ రాజు అనిల్ కి ఇవ్వడానికి ఒకే చెప్పాడని సమాచారం.

త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

#TrinadhRao #Dil Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trinadh Rao Nakkina Movie With Anil Ravipudi Story Related Telugu News,Photos/Pics,Images..