బాల్, హాకీ స్టిక్ తో పెయింటింగ్‌... అతగాడికి ఘన నివాళి..!

మన భారతదేశంలో క్రీడాకారులకు అనేక మంది అభిమానులు ఉండటం చూస్తూనే ఉంటాము.అభిమానులు వారి ఆరాధ్య ఆటగాడి పై వివిధ రకాలుగా వారి ప్రేమను చూపిస్తూ ఉంటారు.

 Tribute To Hockey Player Balbir Singh Painting With Hockey Stick And Ball, Balbi-TeluguStop.com

అయితే ఇలాగే తాజాగా చండీగర్ రాష్ట్రానికి చెందిన ఓ కళాకారుడు కూడా ఇష్టమైన ఆటగాడికి ఘన నివాళి అర్పించారు.తనకు ఎంతో ఇష్టమైన హాకీ ఆటగాడు తన అభిమానాన్ని చాటుకుంటూనే భారీ పెయింటింగ్ వేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇకపోతే పెయింటింగ్ వేసి చెప్పడం పెద్ద సంగతి అని అనుకుంటున్నారా.? కాకపోతే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.అదేంటంటే…

ఏదైనా పెయింటింగ్ వేసినప్పుడు కుంచెను ఉపయోగిస్తాము.అయితే.

, అతడు మాత్రం ఆ పెయింటింగ్ వేసేందుకు కుంచె బదులు హాకీ స్టిక్, బాల్ ను ఉపయోగించాడు.బంతిని రంగులో ముంచి దానిని కాన్వాస్ పై పెట్టి హాకీ స్టిక్ తో కదిలిస్తూ అందరినీ అద్భుత పరిచేలా చిత్రాన్ని చిత్రీకరించాడు.

ఇకపోతే చిత్రీకరించిన చిత్రం ఎవరిదో తెలుసా.? ఒకప్పుడు భారతదేశం నుండి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సైతం సాధించిన అద్భుత ఆటగాడు సర్దార్ సింగ్.ఇకపోతే ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న ఆయన కన్నుమూశారు.ఆయనకు నివాళి అర్పించడం లో భాగంగా ఓ యువ అభిమాని చండీగఢ్ లో ఈ అరుదైన చిత్రాన్ని చిత్రీకరించాడు.

కాకపోతే ఆయనకు బల్ బీర్ సింగ్ అంటే అతనికి ఎనలేని అభిమానం.అయితే ఇందుకు సంబంధించి ఆ అభిమాని మాట్లాడుతూ తన అభిమాన క్రీడాకారుడి జయంతి సందర్భంగా తాను గొప్పగా నివాళి అర్పించాలి అనుకున్నాను.

అందుకోసమే ఇలా తాను హాకీ పై అవగాహన పెంచేందుకు,అలాగే తన లెజెండరీ హాకీ ఆటగాడు బల్ బీర్ సింగ్ కు నివాళి అర్పించే విధంగా తాను ఈ చిత్రాన్ని వేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రాన్ని అభిమాని 23* 15 అడుగులకు కాన్వాస్ పై గీసాడు.

ఈ ఈ చిత్రాన్ని గీయడానికి అతనికి పది రోజులకు పైగా సమయం వెచ్చించాడు .చివరికి తను పట్టుదలతో ఆ చిత్రాన్ని పూర్తి చేశాడు.దీంతో తన అభిమాన ఆటగాడికి ఘన నివాళి అర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube