బన్నీ కారుని ఆపిన గిరిజనులు.. ఎందుకంటే...!?  

tribesmen stopped bunny car because, bunny, allu arjun, Tribesmen, who stopped, bunny car, cinema shooting, fans, pushpa shooting - Telugu Allu Arjun, Bunny, Bunny Car, Cinima Shooting, Fans, Pushpa Shooting, Tribesmen, Who Stopped

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అల్లు అర్జున్ డాన్స్ అంటే ఆయన అభిమానులకు మాత్రమే కాదు మిగితా హీరోల ఫ్యాన్స్ కు కూడా ఎంతో ఇష్టం.

TeluguStop.com - Tribesmen Who Stopped The Bunny Car Because

గత ఏడాది అలా వైకుంఠపురంలో సినిమాతో హిట్ ను సొంతం చేసుకున్న బన్ని ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ షెడ్యూల్ తో సమయాన్ని గడిపేస్తున్నాడు.వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రారంభం అవ్వకముందే శేషాచలం అడవుల్లో ప్లాన్ చేయగా.

కరోనా మహమ్మారి వలన ప్లానింగ్ మొత్తం పూర్తిగా చేంజ్ చేసింది చిత్రయూనిట్.

TeluguStop.com - బన్నీ కారుని ఆపిన గిరిజనులు.. ఎందుకంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం అందుకు సంబంధించిన షూటింగ్ కోసం చిత్ర యూనిట్ తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం మండల పరిధిలో ఉన్న తాళ్లపాలెం, కోట, పాముబొక్క తదితర గ్రామాలలో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమా గంధపుచెక్క నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఇందుకోసం ఎక్కువ శాతం సినిమా షూటింగ్ అడవి ప్రాంతం లోనే నిర్మాణం చేపడుతుంది చిత్ర బృందం.

ఇది ఇలా ఉండగా ప్రతిరోజూ చిత్రయూనిట్ రంపచోడవరం నుండి పందిరిమామిడి మీదిగా కోట గ్రామానికి షూటింగ్ నిర్వహించేందుకు వెళ్లేవారు.ఇక ఈ విషయాన్ని గమనించిన కొంతమంది గిరిజనులు అల్లు అర్జున్ కారుకు అడ్డుపడి వారి బాధను తెలియజేశారు.షూటింగ్ జరిగే ప్రాంతానికి మేము వస్తే మమ్మల్ని అక్కడి నుంచి పంపిస్తున్నారు అంటూ, మేమందరము మీ ఫ్యాన్స్ మంటూ వారి ఆవేదనను చెప్పే సరికి అల్లు అర్జున్ కార్ టాప్ పైకి ఎక్కి ఆ గిరిజనులతో ఫోటోలు దిగాడు.వెంటనే అక్కడ ఉండే గిరిజనులు కొంతమంది కర్పూరంతో బన్నీకి హారతులు ఇస్తూ, గుమ్మడి కాయతో దిష్టి తీయడం మొదలుపెట్టారు.

మరికొందరైతే బన్నీ బన్నీ అంటూ వారి అభిమానాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తమకు ఇంత ఆదరణ అభిమానం మారుమూల గ్రామాలలో కూడా ఉండడం చూసి అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు .

#Pushpa Shooting #Fans #Allu Arjun #Bunny #Who Stopped

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు