అక్కడ వారికి స్మశానమే ఐసోలేషన్ సెంటర్..!

కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది.వైరస్ నుండి తప్పించుకునేందుకు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్న వైరస్ బారిన పడుతున్నారు.

 Tribals Using Burial Ground As Isolation Center In Khammam District-TeluguStop.com

ఇక సిటీల్లో వైర్స్ వచ్చిన వారిని ఒక గదిలో ఉంచి వారిని బయటకు రానివ్వకుండా చేస్తున్నారు.మరీ ఉదృతంగా ఉంటే ఐసోలేషన్ వార్డ్ కు పంపుతున్నారు.

అక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు.య్తిఏ గ్రామాల్లో పరిస్థితి వేరుగా ఉంది.

 Tribals Using Burial Ground As Isolation Center In Khammam District-అక్కడ వారికి స్మశానమే ఐసోలేషన్ సెంటర్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ ఇంట్లో ఒకరికి వైరస్ వస్తే ఇల్లు వదిలి వాళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.లేటెస్ట్ గా ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలో మొద్దులమడ గిరిజన తండాలో 50 మందికి కరోనా వైరస్ రాగా వారంతా కలిసి అక్కడ ఊరి బయట ఉన్న స్మశానం నే ఐసోలేషన్ సెంటర్ గా మార్చుకుని ఉంటున్నారు.

150 మంది జనాభా ఉన్న ఆ గిరిజన గ్రామంలో 50 మందికి కరోనా పాజిటివ్ రాగా అక్కడ వారికి హోం ఐసోలేషన్ ఎవైలబిలిటీ లేకపోవడంతో అందరు కలిసి స్మశానాన్ని ఐసోలేషన్ సెంటర్ గా మార్చుకుని అక్కడే వండు కుని తింటున్నారు.రెండు రోజులుగా స్మశానంలోనే ఉంటున్న విషయం కలక్టర్ దృష్టికి రాగా వారికి ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

అయితే కొనరు మాత్రం వారికి ఐసోలేషన్ సెంటర్ ఏమి వద్దు అక్కడే స్మశానం లోనే ఐసోలేషన్ సెంటర్ లో ఉంటామని చెప్పారట.వారిని ఎలాగోలా ఒప్పించి ఐసోలేషన్ సెంటర్ కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

#Burial Ground #Tribals #Using

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు