గిరిజన మహిళను ట్రాక్టర్‎తో తొక్కించిన నిందితుడు అరెస్ట్..!  

guntur, tribal women death, culprit arrest, police, narasarao pet,Man Murdered tribal woman with tractor - Telugu Culprit Arrest, Guntur, Man Murdered Tribal Woman With Tractor, Narasarao Pet, Police, Tribal Women Death

గుంటూరు జిల్లాలో ఓ గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.మృతురాలి బంధువులు మంగళవారం ఉదయం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

 Tribal Woman Tractor Nakrekal

ఈ కేసులో నిందితులను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు.దీనిపై స్పందించిన పోలీసులు నిందితుడు శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

గుంటూరు జిల్లా నకరికల్లు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రూ నాయక్, మంత్రూ బాయి భార్యభర్తలు.వీరు అటవీ భూముల్లో సాగు చేసుకుంటూ దానిలో రెండున్నర ఎకరాల భూమిపై హక్కులు పొందారు.రెండేళ్ల క్రితం పొలం ఖర్చులతో పాటు కుటుంబ అవసరాల నిమిత్తం ఇదే మండలంలోని నర్సింగపాడు గ్రామానికి చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తితో రూ.3.80 లక్షలు అప్పు తీసుకున్నారు.అయితే కొంతకాలంగా వడ్డీతో సహా అప్పు తీర్చాలంటూ శ్రీనివాసరెడ్డి ఈ దంపతులపై ఒత్తిడి తీసుకువచ్చారు.

గిరిజన మహిళను ట్రాక్టర్‎తో తొక్కించిన నిందితుడు అరెస్ట్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఇరువురు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.అప్పు చెల్లించకుంటే తనఖా పెట్టిన భూమిని స్వాధీనం చేసుకుంటానని బెదిరించాడు.

తన అప్పులు తీర్చకుండా మంత్రూ నాయక్, మంత్రూ బాయిలు పొలం పనులకు వెళ్తున్నారనే సమాచారంతో తండాకు శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తీసుకెళ్లాడు.అప్పులు చెల్లించకుండా పొలంలోకి అడుగు పెట్టేది లేదని శ్రీనివాసరెడ్డి అడ్డుకోవడంతో.

ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి తన ట్రాక్టర్ తో మంత్రూ బాయిని తొక్కించాడు.

దీంతో అమె అక్కడికక్కడే మృతి చెందింది.

#Culprit Arrest #Police #ManMurdered #Guntur #Narasarao Pet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tribal Woman Tractor Nakrekal Related Telugu News,Photos/Pics,Images..