ఉపాధ్యాయునికి ట్రాన్స్ ఫర్ అయ్యిందని ఆ ఊరు మొత్తం ఏం చేసిందో తెలుసా..!

ఒక ప్రభుత్వ స్కూల్లో టీచర్ ట్రాన్సఫర్ అయితే ఆ ఊరు ఊరంతా వచ్చి… ఆ మాస్టారును పెళ్ళి వేడుకలోలాగా ఉరేగించుకుంటూ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ డాన్స్ చేస్తూ ఆయనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు.ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

 Tribal Village Bids Goodbye To Govt School Teacher Narendra Goud Who Won Hearts,-TeluguStop.com

మునుపటి రోజుల్లో ఊరులో పాఠాలు చెప్పే మాస్టారు అంటే ఎంతో గౌరవంగా చూసుకునేవారు.సొంత మనిషిలా ఆదరించేవారు.ఆ మాస్టారులు కూడా ఊరులో బాగా కలిసిపోయేవారు.అందరి మంచి చెడుల గురించి తెలుసుకుంటూ వాళ్ళకు చేతనైన సహాయం చేసేవారు.

కానీ ఈ రోజుల్లో కొంతమంది మాస్టారులు స్కూల్ కి వచ్చామా.పాఠాలు చెప్పామా.ఇంటికి వెళ్లపోయామా అనే విధంగా ఉన్నారు.మరికొంత మంది మాత్రం ఇప్పటికి పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా.

వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకుంటూ చేతనైన సహాయం చేస్తున్నారు.

సరిగ్గా అలాంటి కోవకే చెందుతారు మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్కూల్ మాస్టర్.

ఈయన పేరు నరేంద్ర గౌడ్.ఈయన విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం మల్లుగూడ గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.

ఈయన 20 కిలో మీటర్ల దూరం నుండి పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చేవారు.ఈయన పాఠాలు మాత్రమే కాదు.ఆయనకు తెలిసిన ఆటలు,పాటలు వంటివి కూడా పిల్లలకు నేర్పించేవారు.అంతేకాదు పోటీపరీక్షల్లో కూడా విద్యార్థులకు సూచనలు ఇచ్చేవారు.

కేవలం పిల్లలతో మాత్రమే కాకుండా మల్లుగూడ గ్రామ ప్రజల కష్టసుఖాలను కూడా అడిగి తెలుసుకునేవారు.

Telugu Andhra Pradesh, Farewell, Teacher, Malluguda, Narendra Goud, Transfer, Vi

అలా పిల్లలతో, పెద్దలతో అందరితో బాగా కలిసిపోయి ఆత్మీయులుగా వారిమధ్య విడదీయలేని బంధం ఏర్పడింది.అంతా బాగుంది అనుకునే లోపే నరేంద్ర గౌడ్ కు ట్రాన్ఫర్ ఆర్డర్ వచ్చింది.ఆ వార్త వినిగానే పిల్లలు వెళ్లొద్దు సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ గ్రామా ప్రజలు కూడా బాధపడ్డారు.ఆయన బదిలీపై అదే జిల్లాలో మరొక పాఠశాలకు వెళ్లిపోతున్నారు.

నరేంద్ర గౌడ్ ట్రాన్సఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకాలని ఆ గ్రామస్తులు నిర్ణాయించుకున్నారు.ఈ ఊరిలో మొత్తం 42 ఇళ్లున్నాయి.వారంతా కలిసి నరేంద్ర గౌడ్ కు పసుపు నీళ్లతో కాళ్ళు కడిగి.భుజాలపై ఎత్తుకుని డాన్స్ చేస్తూ ఉరేగించారు.

జనవరి 31 న ఆ ఊరంతా భోజనాలు పెట్టి.ఆ టీచర్ కుటుంబ సభ్యులందరికీ కొత్త బట్టలుతోపాటు.ఒక బీరువా, వెండి నాణేలు, సీలింగ్ ఫ్యాన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.తనపై గ్రామస్తులు చూపిస్తున్న ప్రేమను చూసి నరేంద్ర గౌడ్ కు కళ్ళనుండి ఆనంద బాష్పాలు వచ్చాయి.

ఇదంతా విన్న ఉన్నతాధికారులు కూడా సంతోష పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube