ప్రస్తుత కాలంలో మంచి ప్యాకేజ్ తో ఎవరైతే ఉద్యోగం సాధిస్తారో వాళ్లకు మాత్రమే కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావనే సంగతి తెలిసిందే.లక్ష్యంపై దృష్టి పెట్టి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రశాంత్ నాయక్( Prasanth Nayak ) ప్రూవ్ చేశారు.
ఏడాదికి 75 లక్షల రూపాయల ప్యాకేజ్ తో ప్రశాంత్ నాయక్ ఉద్యోగం సాధించడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మారుమూల గిరిజన తండాకు చెందిన ప్రశాంత్ నాయక్ తెలంగాణలోని మారుమూల గిరిజన తండాకు( Tribal Student ) చెందిన విద్యార్థి కావడం గమనార్హం.
బాల్యం నుంచి ప్రశాంత్ నాయక్ చదువులో చురుకుగా ఉండేవారు.ఇంటర్ వరకు శ్రీచైతన్యలో చదువుకున్న ప్రశాంత్ నాయక్ తర్వాత రోజుల్లో హైదరాబాద్ లో ఐటీఐలో సీటు సాధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరారు.

బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో ప్రశాంత్ నాయక్ టోక్యోలో ఉన్న యోకోగావా ఎలక్ట్రికల్ కార్పొరేషన్ కంపెనీలో( Yokogawa Electric Corporation Company ) 75 లక్షల రూపాయల ప్యాకేజీతో ఇంజనీర్ గా ఎంపిక కావడం గమనార్హం.ప్రశాంత్ నాయక్ జపాన్ లో( Japan ) జాబ్ కు ఎంపిక కావడంతో ప్రశాంత్ నాయక్ తల్లీదండ్రులు ఎంతగానో సంతోషిస్తున్నారు.మంచి ఉద్యోగం రావడంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

బాల్యం నుంచి సివిల్స్ సాధించాలని( Civils ) లక్ష్యంగా పెట్టుకున్న ప్రశాంత్ నాయక్ ఏదో ఒకరోజు ఆ లక్ష్యాన్ని కూడా సాధిస్తానని ప్రశాంత్ నాయక్ అన్నారు.ప్రశాంత్ నాయక్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ప్రశాంత్ నాయక్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.
ప్రశాంత్ నాయక్ రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ సాధిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భవిష్యత్తులో ప్రశాంత్ నాయక్ యూపీఎస్సీ పరీక్షలో కూడా సక్సెస్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తారేమో చూడాల్సి ఉంది.