ఏపీలో త్రిముఖ పోటీ..గెలుపు ఎవరిదో..?   Triangle Fight In Ap Politics…Who Is Winner     2018-03-16   06:27:39  IST  Bhanu C

ఏపీ లో 2019 ఎన్నికలు బహుశా ఏపీ ప్రజలు ఎన్నడూ చూడనట్లుగా మాంచి రంజుగా ఉండబోతున్నాయి…గత ఎన్నికల్లో బీజేపీ, టిడిపి పార్టీలు ఒక్కటిగా కలిసి బరిలోకి దిగాయి..జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు,మోడీ లకి సపోర్ట్ చేశారు.. దాంతో టిడిపి గెలుపు నల్లేరు మీద నడకలా సాగి అధికారంలోకి వచ్చింది..అయితే అప్పుడు కేవలం వారికి వచ్చిన ఓట్ల శాతం కేవలం 1.9% మాత్రమే

అయితే ఇప్పుడు పరిస్థితి మారింది…చంద్రబాబు కేంద్రంతో తెగతెంపులు చేసుకున్నారు..మరోపక్క బిజెపికి, టిడిపికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమని మండుతోంది..కేంద్రం ఏపీ ని అన్యాయం చేసింది అంటూ టిడిపి ఇప్పుడు ప్రత్యేక హోదా ని నెత్తిన పెట్టుకొని కేంద్రం పై నిప్పులు చేరుగుతూ.. ఈ మూడేళ్ళలో తాము ఏమి చేశామో చెపుతూ ఎన్నికలకి వెళ్లాలని యోచిస్తున్నారు..రాష్ట్రానికి వచ్చిన ఐటీ పెట్టుబడులు…ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి..చంద్రబాబు అనుభవమే ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల పొరులోకి వెళ్లాలని చూస్తున్నారు..

ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒంటరి పోరు చేపడుతాను అని చెప్పేశాడు.. అంతేకాదు రెండు రోజుల క్రితం గుంటూరులో పవన్ పెట్టిన సభ మనకి బాగా కలిసి వస్తుందని భావించిన చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పవన్…చంద్రబాబు నీటి మంతుడు అనుకున్నాను అంతా అవినీతి మయం అంటూ చంద్రబాబు తో సహా లోకేష్ పై కూడా ఫైర్ అయిన పవన్ ఈ సారి టిడిపిలోకి వెళ్లారని ఖాయం అయ్యింది… కొత్తగా ఎన్నికల పొరులోకి దిగడం, క్రేజ్ ఉన్న సినిమా హీరో కావడం…యువకులు..తన సామాజిక వర్గం అంతా పవన్ కి అండగా ఉంటారని భవిస్తూ ఇప్పుడు దూకుడుగా వెళ్తున్నారు..

ఇక జగన్ మోహన్ రెడ్డి…పాదయాత్రతో జనంలో దూసుకు వెళుతున్నారు….ప్రజలు మార్పుని కోరుతున్నారు…చంద్రబాబు ఎంతో అవినీతి చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు…పాదయత్రకి బ్రహ్మరథం పట్టడం…యాత్రలో ప్రజలకి వరాలు కురిపించడం.. తాజాగా పవన్ కళ్యాణ్ బాబు గారికి ఇచ్చిన షాక్ ఇవన్నీ జగన్ కి కలిసొచ్చే అంశాలనే చెప్పాలి… దీంతో వచ్చే ఎన్నికలు చంద్రబాబు, జగన్, పవన్ ల మధ్యనే సాగుతుందన్నది వాస్తవం. మరి పవన్ ఎఫెక్ట్ జగన్ కి లాభం చేకూర్చుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది…ఈ త్రికోణపు పోరులో విజేతలు ఎవరనేది తెలాలంటే కొంతకాలం ఆగాల్సిందే..