త్వరలో ప్రారంభం కానున్న రామగుండం ఎరువుల కర్మాగారం.. ట్రయల్‌రన్‌ పూర్తి చేసిన అధికారులు.. !

రామగుండంలో రెండు దశాబ్దాల క్రితం మూత పడిన ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు మళ్లీ పునర్‌ వైభవం రానుంది.కాగా దేశంలో ఏటా 300 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను వినియోగిస్తుండగా 240 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.

 Trial Run Completed In Ramagundam Fertilizers Industry-TeluguStop.com

మిగిలిన 60 లక్షల మెట్రిక్‌ టన్నులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా మూతపడిన ఐదు కర్మాగారాలను పునరుద్ధరించాలని నిర్ణయించింది.

ఇందులో మొదటగా తెలంగాణలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సిద్ధమైంది.ఇప్పటికే ఈ కర్మాగారాన్ని ప్రారంభించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిన రాజస్థాన్‌, ఒడిశాలకు చెందిన వలస కూలీలు తిరిగి రాకపోవడంతో పనులు చివరి దశలో నిలిచిపోయాయి.

 Trial Run Completed In Ramagundam Fertilizers Industry-త్వరలో ప్రారంభం కానున్న రామగుండం ఎరువుల కర్మాగారం.. ట్రయల్‌రన్‌ పూర్తి చేసిన అధికారులు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కార్మికులు మళ్లీ రావడంతో కర్మాగార నిర్మాణపనులను దాదాపు పూర్తిచేశారు.ఇకపోతే రామగుండం ఎరువుల కర్మాగారంలో శనివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు అధికారులు ట్రయల్‌రన్‌ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి సంస్థ సీఈవో నిర్లప్‌ సింగ్‌ రాయ్‌ హాజరయ్యారు.రూ.6,180 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తున్నాయి.దీంతో ఈ పరిశ్రమలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేపనూనె పూత పూసిన యూరియాను ఉత్పత్తి చేయనున్నారట.కాగా ప్లాంట్‌ పూర్తిస్థాయి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ ‌రన్‌ ప్రారంభించినట్లు సీఈవో తెలిపారు.

ఇకపోతే ఏటా 13 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేయలనేది ఈ పరిశ్రమ లక్ష్యం అని ఈ సందర్భంగా వెల్లడించారు.

#Completed #Trial Run #Ramagundam #Peddapalli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు