ఈ ఛాలెంజ్ మహా పాపులర్ గురూ !   Trending Falling Stars Challenge At China     2018-10-21   15:43:05  IST  Sai M

మనకు మాములుగా జంపింగ్ ఫ్లయింగ్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కానీ దానికి బదులుగా పడటం ఇష్టం ఉన్నవాళ్లు తెలుసా బాగా, మంచం మీద పడటం లేదా ప్రేమలో పడిపోవటం గురించి కానీ యాదృచ్ఛిక ప్రదేశాలలో పడిపోవటం గురించి మేము మాట్లాడటం లేదు. ఇంటర్నెట్ లో ఇప్పుడు కికి ఛాలెంజ్ అనంతరం, కొత్త ఛాలెంజ్ ఒకటి వచ్చింది .. సోషల్ మీడియా ఖాతాలపై ఈ ఛాలంజ్ కి సంబంధించి చిత్రాలను పోస్ట్ చేయడం మొదలు అయ్యింది.

ఫాలింగ్ స్టార్స్-2018 పేరుతో ఇంటర్నెట్ లో తెగ దర్శనమిస్తోంది. ఇప్పటికే జనాలంతా … ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బౌల్ చాలెంజ్, కికి చాలెంజ్ లు చూసారు. కానీ ఇది కొత్త తరహా ఛాలెంజ్ అంట. ఈ చాలెంజ్ విసిరే వ్యక్తులు రోడ్డు మీద పూర్తిగా బోర్లా పడిపోయి ఉంటారు. వారి చుట్టూ తమ ఖరీదైన వస్తువులు, కట్టల కొద్దీ క్యాష్ బయటపడి చిందరవందరగా ఉంటుంది. సదరు వ్యక్తులు దాన్నేమీ పట్టించుకోకుండా అలా పడిపోయి ఉంటారు. ఖరీదైన కార్లలోంచి, ఇతర వెహికల్స్ నుంచి, పడవల్లోంచి పడిపోయి వస్తువుల్ని ప్రదర్శిస్తారు.

Trending Falling Stars Challenge At China-

గత ఆగస్టులోనే ఈ తరహా చాలెంజ్ రష్యాలో మొదలైందని.. అయితే చైనాలో ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయిందని నెటిజన్ల ట్వీట్లను బట్టి తెలుస్తోంది. అయితే ఈ చాలెంజ్ లో డబ్బు, దర్పాన్ని చాటుకోవడం, అహంకారాన్ని ప్రదర్శించడం తప్ప సోషల్ థీమ్ ఏమీ లేదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో విపరీతంగా తయారైంది.